ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

.

Topnews @1pm
ప్రధాన వార్తలు@1PM
author img

By

Published : Jun 30, 2020, 12:59 PM IST

  • కొత్తగా 704 కరోనా కేసులు
    రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకి పెరుగుతోంది. నేడు కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేసుల సంఖ్య 14,595 కు చేరింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
  • పెళ్లై కొద్ది నెలలే.. గ్యాస్​ మింగేసింది..
    విశాఖ సాయినార్​ పరిశ్రమ గ్యాస్​ లీక్​ ఘటనలో మృతుల కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఈ ప్రమాదంలో మృతి చెందిన కెమిస్ట్​ గౌరీశంకర్​కు ఈ ఏడాది ఏప్రిల్​లోనే వివాహం అయ్యింది. ప్రస్తుతం అతని భార్య గర్భవతి అని బంధువులు పేర్కొన్నారు. పెళ్లైన కొద్ది నెలలకే గౌరీ శంకర్​ మృత్యువాతపడడం వారిని తీవ్రంగా కలిచివేస్తోంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
  • యాజమాన్యానిదే బాధ్యత
    విశాఖలో సాయినార్​ ఫార్మా కంపెనీని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్​ రాజ్​ పరిశీలించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్న ఆయన.. ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • తెదేపా నేత బండారుకు అనుమతి నిరాకరణ
    విశాఖ సాయినార్​ పరిశ్రమను పరిశీలించేందుకు తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పోలీసుల తీరును నిరసిస్తూ.. 2 గంటలు అక్కడే నిరీక్షించారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • అక్కలపై ఉన్మాదం..
    ఓ తల్లి కడుపునే పుట్టారు... కలిసి పెరిగారు... ఆటలాడారు. పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి జీవితం వారిది. తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో కంగారుగా వచ్చేశారు. అందరూ కలిసి ముచ్చట్లలో మునిగి తేలారు. గతాన్ని గుర్తు చేసుకుంటూ.. భవిష్యత్తుపై చర్చిస్తున్నారు. ఇంతలోనే తమ్ముడిలో ఉన్మాదం రేగింది. కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఇద్దరు అక్కలు చనిపోగా.. మరో అక్క పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'అమిత్ షా ట్వీట్ ఫేక్​'
    జమ్ము కశ్మీర్, లద్దాఖ్​ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్జాలాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. హోంమంత్రి అమిత్ షా పేరిట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ట్వీట్ ఫేక్​ అని తేల్చిచెప్పింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • భారత్​-చైనా మరోసారి భేటీ
    వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్-చైనా సైనికాధికారులు మరోసారి సమావేశమయ్యారు. ఈ నెల‌ 6, 22వ తేదీల్లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా వైపు ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరుదేశాల లెఫ్టినెంట్‌ జనరళ్లు చర్చలు జరపగా.. ఈ సారి భారత్‌ వైపు ఉన్న చుషుల్‌లో భేటీ అయ్యారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • చైనా నుంచి మరొక వైరస్
    ప్రస్తుతం కరోనా వైరస్​తోనే​ ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో కొత్త వైరస్​ను గుర్తించినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. మనుషులకు సోకడానికి అవసరమైన లక్షణాలన్నీ ఈ వైరస్​కు ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'అయ్యో వార్నర్​ 'టిక్​టాక్'​ బ్యాన్​ చేశారు
    భారత్​లో టిక్​టాక్​ను నిషేధిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​ను.. టీమ్​ఇండియా స్పిన్నర్​ అశ్విన్​ సరదాగా ట్రోల్ చేశాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'వాళ్ల కంటే బాగా నటించాలి అనుకుంటా'
    పోటీ వాతావరణాన్ని తాను ఎప్పుడూ ఇష్టపడతానని చెబుతోంది నటి నభా నటేష్​. ఏ రంగంలోనైనా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నప్పుడే మనల్ని మనం సరికొత్తగా నిరూపించుకోగలుగుతామని వెల్లడించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.