ETV Bharat / city

ప్రధాన వార్తలు@1PM

.

Bharat Topnews 1pm
ప్రధాన వార్తలు@1PM
author img

By

Published : Jun 27, 2020, 1:16 PM IST

  • ఎస్పీవై ఆగ్రోలో లీకైనా విషవాయువు

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాల్లేవని కేంద్రజల శక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. పెంటపాటి పుల్లారావు అనే సామాజిక వేత్త ఫిర్యాదుకు స్పందించిన జలశక్తి శాఖ.... ఈ మేరకు సమాధానం ఇచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య

నిండు నూరేళ్లు కలిసుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరిచి.. క్షణిక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. వివాహేతర సంబంధాలు.. హత్యలకు దారితీస్తున్న ఉదంతాలు... ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇలాంటి ఘటనే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సహకారంతో భర్త‌ను హతమార్చింది ఓ వివాహిత. ఆమె కుమార్తె ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా

గుంటూరు సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో శిక్షణ పొందుతున్న ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ జరిగింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • మెరుగ్గానే ఉన్నాం

కరోనా నియంత్రణలో భారత్​ మెరుగ్గానే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్​లో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని చెప్పారు. డా. జోసెఫ్ మర్​తోమా 90వ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. సమాజ ఉన్నతికి జోసెఫ్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • పక్షుల కిల కిలలే.. ఆమె గుండె చప్పుడు

దివింది పదో తరగతి వరకే అయినా.. అయిదు భాషల్లో అనర్గళంగా మాట్లాడేస్తుంది. అడవి తల్లి ఒడిలో వడివడిగా అడుగులేస్తూ.. పర్యటకులకు ప్రత్యేకతలు వివరిస్తుంటుంది. ఆవిడ పేరే సుధా చంద్రన్‌. నడి వయసులో భర్తను కోల్పోయి.. పేదరికాన్ని అనుభవిస్తోంది. క్యాన్సర్‌ను జయించి.. తనకంటూ ఓ ప్రత్యేకత సాధించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఫేస్​బుక్, ట్విట్టర్​ షేర్లు కుదేలు

సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు నిలిపివేయనున్నట్లు యునిలీవర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఫేస్​బుక్​, ట్విట్టర్​ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. రెండు కంపెనీలు 7 శాతానికిపైగా నష్టాన్ని మూటగట్టుకున్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • విగ్రహాలు ధ్వంసం చేస్తే 10 ఏళ్ల జైలు

అగ్రరాజ్యంలో చెలరేగిన జాత్యహంకార నిరసనల్లో భాగంగా ఇటీవల విగ్రహాల ధ్వంసం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలోని స్మారక చిహ్నాలు, విగ్రహాలను రక్షించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో 'హాస్యబ్రహ్మ'

ఓ మొక్క నాటి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.. తన వంతు బాధ్యత చాటుకున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 2023 ప్రపంచకప్​ కోసం అప్పుడే ప్లాన్ వేశాడు!

లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఆసీస్ సారథి ఫించ్.. రాబోయే టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్​ల కోసం అప్పుడే ప్లాన్​లు వేశాడు. విజయం సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.