ETV Bharat / city

కొవాగ్జిన్​ షిప్పింగ్​ను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: సుచిత్ర ఎల్లా

author img

By

Published : Jan 29, 2021, 10:47 PM IST

తొలిసారి కొవాగ్జిన్​ వాక్సిన్​ షిప్పింగ్​ రోజున తన రోమాలు నిక్కపొడుచుకున్న అనుభూతి కలిగిందని భారత్​ బయోటెక్​ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో 'సోసైటీ ఫర్‌ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్- ఎస్సీఎస్సీ' 15 వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె నాటి గుర్తులను పంచుకున్నారు.

కొవాగ్జిన్​ షిప్పింగ్​ను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: సుచిత్ర ఎల్లా
కొవాగ్జిన్​ షిప్పింగ్​ను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: సుచిత్ర ఎల్లా

జనవరి 13న తొలిసారిగా కొవాగ్జిన్​ షిప్పింగ్ ప్రక్రియను దూరదృశ్యమాధ్యమంలో చూసిన తన కళ్లలో నీళ్లు తిరిగాయని భారత్​ బయోటెక్​ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో 'సోసైటీ ఫర్‌ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్- ఎస్సీఎస్సీ' 15 వార్షికోత్సవంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్​ రంజన్​, హైదరాబాద్‌, రాచకొండ సీపీలతో కలిసి సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు.

భావోద్వేగానికి గురైన భారత్​ బయోటెక్​ జేఎండీ

షిప్పింగ్​ రోజున తన రోమాలు నిక్కపొడుచుకున్న అనుభూతి కలిగిందని సుచిత్ర ఎల్ల అన్నారు. కొవాగ్జిన్​ కోల్డ్​ ట్రక్కులకు తెలంగాణ పోలీసులు విమానాశ్రయం వరకూ ఎస్కార్ట్​గా వెళ్లారని గుర్తుచేశారు. తనతో సహా భారత్​ బయోటెక్​ బృందానికి అదో గొప్ప సంఘటనగా అభివర్ణించారు.

ఇవీచూడండి: వచ్చేనెల తొలివారం నుంచి కరోనా యోధులకు టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.