ETV Bharat / city

'ఏ మహమ్మారికైనా హైదరాబాద్​ నుంచే టీకా రావాలి'

భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రా ఎల్లాను జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తన ఒక్కరిది కాదని.. ఫార్మా, లైఫ్ సెన్సెస్​ ఎకోసిస్టమ్​కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. జీవశాస్త్ర రంగంలో ఉత్తమ సేవలందించినందుకు బయో ఆసియా 2021లో జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ పురస్కారం ఈ ఏడు భారత్​ బయోటెక్​ సీఎండీ, జేఎండీలకు దక్కింది.

భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్ల
భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్ల
author img

By

Published : Feb 22, 2021, 2:57 PM IST

భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్ల

జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ అవార్డు పొందిన భారత్​ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల ఈ పురస్కారం ఫార్మా, లైఫ్ సైన్సెస్​ ఎకోసిస్టమ్​కు దక్కినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్​ నుంచే టీకాలు రావాలని అన్నారు. 65 శాతం వ్యాక్సిన్​లు భాగ్యనగరం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. అతిపెద్ద తయారీ హబ్​గా ఈ నగరం సత్తా చాటుతోందని చెప్పారు. జినోమ్ వ్యాలీ ప్రపంచంలోనే బెస్ట్ హబ్​ అని పేర్కొన్నారు.

హైదరాబాద్​లో నిర్వహించిన బయో ఆసియా 2021 సదస్సులో జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించే వారికి ఏటా జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులు అందజేస్తారు. ఈ ఏడాది.. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల ఈ పురస్కారాలు అందుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.