ETV Bharat / city

తెదేపా కమిటీల్లో మరోమారు బీసీలకు అధిక ప్రాధాన్యం - TDP state committees news

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నియామకంలో మరోసారి బీసీలకే అధిక ప్రాధాన్యం కల్పించారు. 41శాతం పదవులు వారికే కేటాయించడంతో పాటు ఉపకులాలకు సైతం చోటు కల్పించారు. సీనియర్లకు ప్రాధాన్యమిస్తూనే కొత్తవారికి ప్రోత్సాహాన్నిచ్చేలా రాష్ట్ర కమిటీ కూర్పు ఉంది.

తెదేపా కమిటీల్లో మరోమారు బీసీలకు అధిక ప్రాధాన్యం

author img

By

Published : Nov 7, 2020, 4:58 AM IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నియామకంలో ప్రధాన కార్యదర్శుల నుంచి కార్యదర్శుల వరకు మొత్తం 221 మందికి పదవులు దక్కగా... అందులో అత్యధికంగా 41శాతం బీసీలే ఉన్నారు. ఎస్సీలకు 11, ఎస్టీలకు 3, మైనార్టీలకు 6శాతం చొప్పున అవకాశం కల్పించారు. ఇటీవల నియమించిన పార్లమెంటరీ కమిటీలు, పొలిట్‌ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ బీసీ వర్గాలకే పెద్దపీట వేశారు.

తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అనే ముద్రను కొనసాగిస్తూ... తాజా నియామకాల్లోనూ అదే పంథా కొనసాగించారు. ఇందులో 50 ఉపకులాలకు సైతం చోటు కల్పించారు. పదవుల పంపకంలో సీనియర్లు, జూనియర్లతో పాటు యువతకు సమప్రాధాన్యం కల్పించారు. మొత్తంగా నేతల సగటు వయసు 48 ఏళ్లుగా ఉంది. కేంద్ర కమిటీలో పదవులు ఆశించి దక్కనివారికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు.

పనితీరుకు ప్రోత్సాహంగా పలువురు కొత్త నేతలకూ రాష్ట్రస్థాయి కమిటీలో పదవులు దక్కాయి. సామాజికవర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే అనుభవం ఉన్న నేతలకు, యువతకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగానూ అన్ని ప్రాంతాలకు సమప్రాధాన్యం కల్పించారు. దీంతో పదవుల సంఖ్య పెరిగింది. గతంలో ఎప్పుడూ పదవులు దక్కని పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతం వంటి.. నియోజకవర్గాల నేతలకూ ఈసారి ప్రాతినిధ్యం కల్పించారు.

మొత్తం 18 మందిని పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఇందులో ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, జి.తిప్పేస్వామి, మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపల్లి సూర్యారావు, సుజయకృష్ణ రంగారావు, పరసారత్నం తదితరులున్నారు. మాజీఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పిడతల సాయి కల్పనారెడ్డి వంటి సీనియర్లకూ ప్రాధాన్యం కల్పించారు. గతంలో జిల్లా, నగర పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన పుత్తా నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, వి.హనుమంతరాయచౌదరి, శ్రీధర కృష్ణారెడ్డి వంటి వారికీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అవకాశం దక్కింది.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మొత్తం 16 మందికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు తదితరులకు అవకాశం కల్పించారు. మాజీమంత్రులు దేవినేని ఉమ, అమరనాథ్‌రెడ్డి, భూమ అఖిలప్రియకు చోటు దక్కింది. పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కార్యనిర్వాహక కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న పంచుమర్తి అనూరాధను ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

రాష్ట్రస్థాయిలో 18 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. ఎమ్మెల్సీలు గౌనివాని శ్రీనివాసులు, ద్వారపురెడ్డి జగదీశ్, మర్రెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు పరిటాల శ్రీరామ్, గంజి చిరంజీవులు తదితరులకు అవకాశం కల్పించారు. ప్రాంతాల వారీగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న యువతకు రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. చింతకాయల విజయ్, మద్దిపాటి వెంకటరాజు, గౌతు శిరీష, ఎండీ నజీర్, పిల్లి మాణిక్యరావు, మద్దిపట్ల సూర్యప్రకాశ్, సప్తగిరి ప్రసాద్‌ తదితరులకు యువత కోటాలో ప్రోత్సాహం కల్పించారు.

ఇదీ చదవండీ... అప్పు తీర్చలేదని తండ్రీ కొడుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.