ETV Bharat / city

తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీకి అరుదైన అవార్డు

తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయానికి అంతర్జాతీయ స్థాయిలో మరో అవార్డు దక్కింది. మెరుగైన సాంకేతిక విద్యను అందించడంలో ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ విద్యాసంస్థగా ఘనత సాధించింది. థాయిలాండ్​ రాజధాని బ్యాంకాక్​లో 'ఏషియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఎడ్యుకేషన్-2019' పురస్కారాన్ని బాసర ఆర్జీయూకేటీ ప్రతినిధి మల్లెల శివరాం అందుకున్నారు.

author img

By

Published : Dec 15, 2019, 9:09 PM IST

basara-in-nirmal-district-rgukt-university
బాసర ట్రిపుల్ ఐటీకి అరుదైన అవార్డు
బాసర ట్రిపుల్ ఐటీకి అరుదైన అవార్డు

తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ విద్యాసంస్థ పురస్కారాన్ని అందుకుంది. మెరుగైన సాంకేతిక విద్యను అందిస్తున్నందుకు ఇంటర్నేషన్​ బ్రాండ్​ కన్సల్టింగ్​ కార్పొరేషన్​(ఐబీసీ) సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ ప్రతినిధిగా మల్లెల శివరాం పురస్కారం అందుకున్నారు.

గర్వంగా ఉంది

ఈ అవార్డు సాధించటం గర్వంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తమ విజయాన్ని పెంచేందుకు ప్రేరణగా నిలిచాయని ఆర్జీయూకేటీ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ ప్రొఫెసర్​ డాక్టర్​ శ్రీహరి అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించడం, గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం వల్ల గతంలోనూ ఎన్నో అవార్డులు ఆర్జీయూకేటీ సొంతం చేసుకుందని తెలిపారు.

అత్యున్నత ప్రమాణాలు

యూనివర్సిటీలో 60 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారని అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ రంజిత్ కుమార్ తెలిపారు. ఆర్జీయూకేటీ అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

'మలి'జోడు: ఒంటరి మనసులు ఒక్కటైన వేళ!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.