జిల్లాల్లోని... నగరం, పట్టణాల్లో వేల మంది వీధి వ్యాపారులు ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో గతంలోనే సర్వే జరిగింది. తరువాత గుర్తింపు కార్డులు సైతం అందజేశారు. ‘ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ నిధి’ పథకం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కేంద్రం సంకల్పించింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలోనూ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన వ్యాపారులందరికీ రుణాలు ఇచ్చేలా సానుకూలత తెలిపారు. పట్టణ, నగర ప్రాంతాల్లో తోపుడు బండ్లు, సైకిళ్లు, బడ్డీలు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్లు, తినుబండారాలు, టీ, టిఫిన్లు, తదితర వాటిని విక్రయించే వారికి ఇది కాస్త ఊరట ఇచ్చే అంశమే.
సద్వినియోగం చేసుకుంటే మేలే: వ్యాపారులకు ఈ పథకం కాస్త అండగా ఉండే అవకాశం ఉంది. తీసుకున్న అప్పును వ్యాపారంపై పెట్టుబడి పెట్టి వచ్చే లాభంతో బ్యాంకు రుణం తీర్చితే మూలనిధి పెట్టుబడి మిగులుతుంది. దీనికి తోడు ఏడాదిలో రుణం తీర్చాక బ్యాంకర్లకు నమ్మకం కలిగి మళ్లీ రుణాలు నవీకరణ (రెన్యువల్) చేసేందుకు ముందుకు వచ్చే వీలుంది. ఇప్పటికే గుర్తించిన వారి పేర్లను కేంద్రమే నేరుగా బ్యాంకులకు నివేదిస్తుంది. బ్యాంకుల నుంచి వ్యాపారులకు సమచారం అందుతుంది. ఆధార్, చరవాణి సంఖ్య అనుసంధానం కావాలి. పథకంలో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇంత వరకు 2,204 మందిని గుర్తించారు. ఇంకా అర్హులైన వారుంటే వారినీ పథకంలో చేర్చేలా అధికారులు ముందడుగేస్తున్నారు.
మూల నిధిగా:
వీరంతా కొద్దిపాటు సొమ్ములతో వ్యాపారాలు సాగించేవారే. మూల నిదినిఫ కరోనా మింగేసి దిక్కుతోచని పరిస్థితి నెలకొన్న క్రమంలో రూ.10 వేల రుణం సంజీవినిలా మారింది. ఈ ప్రక్రియ ఇప్పటికే జిల్లాలో అమల్లోకి వచ్చింది. బ్యాంకులు వారీగా ఎంత మందికి రుణాలు ఇవ్వాలన్న దానిపై స్పష్టత వచ్చింది. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా తిరిగి వ్యాపారులు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. 7శాతం వరకు వడ్డీ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ‘జగనన్న తోడు’ పథకంలో రూ.10వేల రుణాలను వడ్డీ రహితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
అర్హులందరికీ రుణాలు:
అర్హులందరికీ రుణాలు ఇవ్వాలన్నదే మా సంకల్పం. ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. వీధి వ్యాపారులను ఇప్పటికే సర్వే ద్వారా గుర్తించి గుర్తింపు కార్డులు అందజేశాం. వీరందరికీ రుణాలు అందుతాయి. ‘ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ నిధి’ రుణాలకు 7శాతం వడ్డీ చెల్లించాలి. జగనన్న తోడు పథకం వడ్డీ రాయితీగా ఉంటుంది.
-ఎం.కిరణ్‌కుమార్, పీడీ, మెప్మా, శ్రీకాకుళం
ఇదీ చదవండి: