Mother Commits Suicide With Two Children in Vijayawada : ఆ తల్లి ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. తొమ్మిది మాసాలు మోసి కని, అపురూపంగా చూసుకుంది. అల్లారుముద్దుగా పెంచింది. కంటికి రెప్పలా వారిని కాపాడుకుంది. తన సర్వస్వం వారే అనుకుంది. ఆ ఇద్దరు చిన్నారులే ఇంటికి వెలుగుగా భావించింది. వారితో సంతోషంగా గడుపుతున్న వేళ దంపతులు మధ్య కుటుంబ కలహాలు రేగాయి. క్షణికావేశంలో చేయరాని తప్పు ఆ తల్లి చేసింది. పిల్లలతో సహా తానూ నీటిలోకి దూకేసింది. పాపం పసివాళ్లు. నీటిలో పడి ఎలా విలవిల్లాడిపోయారో! ఊపిరి ఆడక ఎంత ఉక్కిరిబిక్కిరి అయ్యారో. అభం శుభం తెలియని పిల్లలు తల్లిదండ్రుల కలహాలకు ఆగమయ్యారు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
ఆనందంగా కుమార్తెను స్కూల్కు పంపింది - అంతలోనే ఆ తల్లికి - Woman Died in Road Accident
కుటుంబ కలహాలతో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులతో సహా తల్లి బందరు కాలువలో దూకింది. ఈ సంఘటనలో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. మిగిలిన ఇద్దరు గల్లంతు అయ్యారు. గుంటూరు జిల్లాలోని శారదా కాలనీలో టి. తిరుపతిరావు, సుధారాణి(23) దంపతులు నివాసం ఉంటున్నారు. తిరుపతిరావు రోజువారి పనులకు వెళ్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారికి జాస్వి (18 నెలలు), బ్లేసి (4 నెలలు) అనే వారు సంతానం. శనివారం (Sep 28) భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది.
తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించిన తల్లి - అనాథలైన పిల్లలు - Woman Gives Birth Nine Babies
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల గాలింపు : దీంతో ఆదివారం ఉదయం (Sep 29) తిరుపతిరావు తన భార్య, పిల్లలతో కలిసి విజయవాడ కృష్ణలంక కళానగర్‌లో ఉంటున్న తన సోదరుడు కోటేశ్వరరావు ఇంటికి వచ్చారు. అక్కడ దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అనంతరం తిరుపతిరావు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సుధారాణి ఇద్దరు చిన్నారులను తీసుకొని స్కూబ్రిడ్జి వద్దకు చేరుకుని ముందు పిల్లలను బందరు కాలువలో పడేసింది. తర్వాత తానూ దూకేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సిబ్బందితో సహా వచ్చి బ్లేసి (4నెలలు)ని వెలికితీశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే చిన్నారిని మృతి చెందింది. గల్లంతైన మిగిలిన ఇద్దరి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.