రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల ప్రచారాన్ని విస్తృతం చేయాలని(awareness with brochures) ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ పథకాలను కరపత్రాలుగా ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేసేలా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రణాళిక శాఖ సూచనలు జారీ చేసింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల స్టేటస్ రిపోర్టులను ముద్రించి, ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయానికి పంపించింది. ఆర్డీఓ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు, అక్కడి నుంచి వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.
ఇందుకోసం రెండు కరపత్రాలను ముద్రించారు. ''రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్దపీట - జగనన్న మ్యానిఫెస్టో'' పేరిట ఆరు పేజీలతో ఒక కరపత్రాన్ని, ''సంక్షేమ సంతకం-రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట'' పేరిట 16 పేజీలతో మరో కరపత్రాన్ని ముద్రించారు. వీటి ముద్రణ ఇప్పటికే పూర్తయిందని.. ఇవి ఆర్డీఓ కార్యాలయాలకు చేరిన అనంతరం ప్రణాళికా బద్దంగా ఇంటింటికీ పంపిణీ చేయాలని కలెక్టర్లకు సూచిస్తూ.. ప్రణాళికా శాఖ కార్యదర్శి కేఆర్ విజయ్ కుమార్ లేఖ రాశారు.
ఇదీచదవండి.