తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో (KBR park in Hyderabad) నటి షాలూ చౌరాసియాపై (attack on actress chaurasia) దాడి జరిగింది. నడకకు వెళ్లిన ఆమెపై ఓ దుండగుడు దాడి (attack on heroine) చేసి చరవాణి లాక్కెళ్లాడు.
రాత్రి 8.30 గంటల సమయంలో షాలూ.. కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు (night walk at KBR park) వెళ్లారు. అక్కడికి అకస్మాత్తుగా వచ్చిన ఓ ఆంగతుకుడు.. ఆమె వద్ద ఉన్న నగలు, నగదు ఇవ్వాలని బెదిరించాడు. ఆమె ఇవ్వకపోవడంతో మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆగంతుకుడితో పెనుగులాడే క్రమంలో అతడు బండరాయితో దాడి చేయడం(attack on shalu chourasia) వల్ల ఆమె తల, కళ్లకు గాయాలయ్యాయి. అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అక్కణ్నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోయేసరికి షాలూ చౌరాసియా డయల్ 100కు సమాచారం అందించారు.
నటి ఫిర్యాదు మేరకు కేసు(actress shalu Chourasia complaint) నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన చౌరాసియాను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీసీఫుటేజీ ద్వారా నిందితుణ్ని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
కేబీఆర్ పార్కు(robbery in KBR park) వద్ద ఇటీవలే దోపిడీ జరిగింది. ఇటీవల కాలంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారి దోపిడీ ఘటనలు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చదవండి :