ధర్మసిద్ధి ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. ఇష్టదేవతా స్తోత్రము పఠిస్తే మంచి జరుగుతుంది.
శారీరక శ్రమ పెరుగుతుంది. నమ్మించి మోసం చేసే వారున్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి. ధర్మసిద్ధి ఉంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. శని శ్లోకం చదవండి.
ప్రయత్న కార్యానుకూలత ఉంది. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. దైవారాధన మానవద్దు.
ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకము చదివితే బాగుంటుంది.
మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదవాలి.
ఇష్ట కార్యసిద్ధి ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యయం సూచితం. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదనకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆంజనేయస్వామి స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.
మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.
చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం.
ముందుచూపు అవసరం. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. అనవసర ఖర్చులు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వము ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మీరు పనిచేసే రంగంలో అనుకూలత ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మ సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. గణపతి స్తోత్రము పఠిస్తే బాగుంటుంది.
అనుకున్నది సాధిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కలహ సూచన ఉంది కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాలి. శనిధ్యాన శ్లోకం చదవండి.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రము పఠించడం వల్ల మేలు జరుగుతుంది.