ఆర్.సోమేశ్వరరావు అనే పేరుగల వ్యక్తి ఎవరూ శాసన సభాపతి వ్యక్తిగత సహాయకుడిగా లేరని శాసనసభ కార్యదర్శి ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డును సృష్టించుకుని ప్రభుత్వకార్యాలయాల్లో కూడా వివిధ పనుల నిమిత్తం అధికారులను ప్రలోభపెడుతున్నట్లు కార్యాలయం దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
శాసన సభ సచివాలయంలోనూ సోమేశ్వరరావు పేరుతో ఎటువంటి గుర్తింపు కార్డు జారీ చేయలేదని తెలిపారు. శాసనసభ సభాపతి కార్యాలయానికి, శాసన సభ సచివాలయానికి గానీ సోమేశ్వరరావు అనే వ్యక్తితో సంబంధం లేదని స్పష్టం చేశారు. సదరు వ్యక్తి చేసే మోసాలకు , ప్రలోభాలకు ఎవరూ గురికావద్దని సభాపతి తెలియజేశారని కార్యదర్శి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: