MONSOON SESSION: శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెలలో కాకుండా సెప్టెంబరులో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు ఎమ్మెల్యేలు, ఎంపీలు రావాల్సి ఉన్నందున ఆ మర్నాటి నుంచి 5 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ఇటీవల నిర్వహించిన వైకాపా ప్లీనరీ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి అంతరాయం కలిగింది. అంతకుముందు నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అయిదారు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే గడప గడపకు కార్యక్రమం మరుగునపడే అవకాశం ఉందన్న వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబరుకు మార్చినట్లు సమాచారం. మరోవైపు సెప్టెంబరులోగా ఎప్పుడైనా సమావేశాలను నిర్వహించుకునేందుకు వెసులుబాటు ఉన్నందున అప్పటి వరకూ వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
ఇవీ చదవండి: