తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్‌లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఈ పెంపు వర్తించనుంది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ.7,500 నుంచి రూ,9,750కి పెరగనున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి పెంచిన ఇన్సెంటివ్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.