ETV Bharat / city

'హోం క్వారంటైన్‌' విధానం బలోపేతం

author img

By

Published : Jun 26, 2020, 7:35 AM IST

Updated : Jun 26, 2020, 8:44 AM IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న దృష్ట్యా... రోగుల ‘హోం క్వారంటైన్‌’ విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ బలోపేతం చేయబోతోంది. వైద్యుల ద్వారా రోగుల పర్యవేక్షణ చేయటంతో పాటు... జిల్లాకొకటి చొప్పున కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.

quarantine
‘హోం క్వారంటైన్‌’ విధానం బలోపేతం

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున రోగుల ‘హోం క్వారంటైన్‌’ విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ బలోపేతం చేయబోతోంది. ఇందులో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక కాల్‌సెంటర్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో కాల్‌సెంటర్‌లో ఇద్దరు వైద్యులు, ఇద్దరు మానసిక వైద్య నిపుణులను నియమించబోతున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులను నిశితంగా గమనించేందుకు క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేయనున్నారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ఏఎన్‌ఎంలు యాప్‌లో నమోదు చేసేలా చూస్తారు.

వీరికి అనుమతి

పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారిలో కరోనా లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రత లేకుండా.. ఇంట్లో ప్రత్యేక గది, మరుగుదొడ్డి కలిగి, పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు లేకపోతే ‘హోం క్వారంటైన్‌’కు వైద్యాధికారులు అనుమతి ఇస్తున్నారు. ఈ వెసులుబాటును ఇప్పటిదాకా సుమారు 250 మంది వినియోగించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారిని వెంటనే కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు తరలించి రక్తపోటు, మధుమేహం, ఎక్స్‌రే, ఈసీజీ తదితర ప్రాథమిక పరీక్షలు చేస్తున్నారు. వీటి ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి ఇబ్బందులూ లేకపోతే, అందునా హోం క్వారంటైన్‌కు సంసిద్ధత వ్యక్తంచేసిన వారినే వైద్యాధికారులు అనుమతి ఇస్తున్నారు. రానున్న రోజుల్లో కేసులు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నందున హోం క్వారంటైన్‌ను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. క్వారంటైన్‌లో ఉండే వారి వివరాలు కొత్తగా ఏర్పాటుచేసే ప్రత్యేక కాల్‌ సెంటర్‌లోని వైద్యులకు అందుతాయి. బాధితులకు మానసిక వైద్య నిపుణులు కౌన్సెలింగ్‌ చేస్తారు.

రక్షణ ‘సొరంగం’..!

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విజయవాడ జిల్లా జైలులో ఆటోమేటెడ్‌ డిస్‌ ఇన్ఫెక్షన్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. దీంట్లో క్లోరిన్‌ రహిత బీఎస్‌ఎల్‌4 ద్రావణం ఉపయోగించడంతో ఎలాంటి హాని ఉండదని విజయవాడ జిల్లా జైలు పర్యవేక్షణాదికారి కె.రఘు తెలిపారు. ఖైదీలు, జైలు సిబ్బంది కోసం దీన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, సెంట్రల్‌ జైళ్లలో ఏర్పాటు చేసేలా జైళ్లశాఖ డీజీ హసన్‌రెజా చర్యలు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: నవంబరు నుంచి పోలవరానికి గేట్లు... సీఎం నిర్దేశం

Last Updated : Jun 26, 2020, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.