నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులోని సెక్యూరిటీ అకాడమీలో ఆనందయ్య మందు తయారు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కృష్ణపట్నంలోనే.. గత నెలలో పంపిణీ చేసిన చోటే అనుకున్నా.. అధికారుల నిర్ణయంతో అంతకు ముందు అక్కడ వేసిన చలువ పందిళ్లు, బారికేడ్లను మంగళవారం సాయంత్రం తొలగించారు. భద్రతతో పాటు పంపిణీ సక్రమంగా జరగాలంటే పోర్టులోని సెక్యూరిటీ అకాడమీలోనే సురక్షితమని ఉన్నతాధికారులు భావిస్తున్నారని సమాచారం. ఆ క్రమంలోనే అధికారికంగా ప్రకటించకపోయినా.. తయారీకి అవసరమైన పాత్రలు, ఇతర సామగ్రిని పోర్టుకు తరలించారు.
ఓ వైపు అధికారులతో చర్చలు జరుగుతుండగానే.. ఆనందయ్య తన బృందంతో ఔషధం తయారీకి అవసరమైన ముడి సరకులు సేకరించే పనిలోకి దిగారు. పంపిణీ తేదీ ప్రకటించేవరకు ఇతరులెవరూ గ్రామంలోకి రావద్దని ఆనందయ్య సూచించారు. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కృష్ణపట్నం గ్రామానికి వెళ్లే మార్గంలో గోపాలపురం వద్ద పోలీసులు చెక్‌పోస్టును కొనసాగిస్తున్నారు. అంతర్గత రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు ఉంచారు.
ఇదీ చదవండి: