ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రతిని ఏపీఎస్ఆర్టీసీకి పంపింది. దీనివల్ల కరోనా లాక్డౌన్తో తమిళనాడుకు ఆగిపోయిన సర్వీసులను ఈ నెల 25 నుంచి ఏపీఎస్ఆర్టీసీ పునరుద్ధరించనుంది. దాదాపు 240 రోజుల తరువాత తమిళనాడులోని చెన్నై, తిరుత్తణి, కాంచిపురంతోపాటు పుదుచ్చేరికి బస్సులను నడపనుంది.
ఏపీ బస్సులు చెన్నై పరిధిలోని మాధవరం బస్టాండ్ వరకు వెళ్తుంటాయి. ప్రస్తుతం అక్కడ మార్కెట్ నడుస్తున్నందున సోమవారం నాటికి ఖాళీ చేసి, 24వ తేదీకి సిద్ధం చేయనున్నారు. తమిళనాడు పరిధిలో ఏపీఎస్ఆర్టీసీ 274 సర్వీసులతో 28 వేల కిలోమీటర్ల మేర నడపనుంది. ఈ ఒప్పందం మేరకు తమిళనాడు రాష్ట్ర సర్వీసులు కూడా రాకపోకలు సాగించనున్నాయి. ఈ బస్సులకు టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి
న్యాయమూర్తులపై పోస్టుల కేసులో సీబీఐ విచారణ ముమ్మరం