రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో సీట్లను ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర కోర్సుల్లో కలిపి 4,96,055 సీట్లు ఉన్నాయి. వీటిలో 1,95,700 సీట్లు కేటాయించినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని 152 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 65,634 సీట్లు ఉన్నాయి. వీటిలో 29,776 (45.37%) సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 116 ఎయిడెడ్ కళాశాలల్లో 73,120 ఉండగా 31,217 సీట్ల (42.69%)ను విద్యార్థులకు అలాట్ చేశారు. 1,033 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 3,57,202 సీట్లు ఉన్నాయి. ఇందులో 1,34,652 (37.70%) సీట్లను విద్యార్థులు పొందారు.
సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో ఈ నెల 27లోగా నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా రిపోర్టు చేయాలి. వీరికి మలివిడత కౌన్సెలింగ్‌లో సీట్ల కోసం ఆప్షన్ల నమోదుకు అవకాశాన్ని కల్పిస్తారు. ఈ రెండు విధానాల్లో రిపోర్టు చేయకుంటే... కేటాయించిన సీట్లు రద్దవుతాయని ఏపీ ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: