ETV Bharat / city

రీసర్వే: గ్రానైట్‌ రాళ్లను సరఫరా చేయనున్న ఏపీఎండీసీ - Land Re Survey news

భూముల రీసర్వేకు అవసరమైన కోటికిపైగా గ్రానైట్‌ రాళ్లను ఏపీఎండీసీ సరఫరా చేయనుంది. వీటికి అవసరమైన యంత్ర సామగ్రికి త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌కు ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని, ప్రభుత్వం రీసర్వే చేపడుతోంది. ఒక్కో సర్వే రాయి ధర జీఎస్టీతో కలిపి రూ.450గా నిర్ణయించడంతో తొలుత ఎవరూ బిడ్లు వేయలేదు. తాజాగా ఒక్కో రాయి ధర రూ.475, జీఎస్టీ, రవాణా, లోడింగ్‌కు అదనపు ధర కోట్‌ చేసేలా అవకాశం కల్పిస్తూ మళ్లీ టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చింది.

గ్రానైట్‌ రాళ్లను సరఫరా చేయనున్న ఏపీఎండీసీ

author img

By

Published : Apr 17, 2021, 5:48 AM IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేకు అవసరమైన కోటికిపైగా గ్రానైట్‌ రాళ్లను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సరఫరా చేయనుంది. తొలి విడతగా రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని సర్వే చేస్తుండగా, వీటికి టెండర్ల ద్వారా రాళ్లను సేకరించనుంది. ఆ తర్వాత అన్నిగ్రామాల్లో సర్వేకు అవసరమైన రాళ్లను మాత్రం ఏపీఎండీసీయే అందించనుంది. దీనికోసం ప్రకాశం జిల్లా చీమకుర్తి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, చిత్తూరు జిల్లాలో ఓ చోట గ్రానైట్‌ గుండ్ల కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. వీటికి అవసరమైన యంత్ర సామగ్రికి త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ.3.5 కోట్ల వ్యయమవుతుందని అంచనా.

గ్రానైట్‌ గుండ్లను ఈ యూనిట్‌లకు తీసుకొచ్చి కొలతల ప్రకారం సర్వే రాళ్లను కటింగ్‌, పాలిషింగ్‌ చేసి రాష్ట్రమంతా సరఫరా చేయనుంది. అయితే వీటికోసం అవసరమైన గ్రానైట్‌ గుండ్లను ఎలా సేకరించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రీసర్వేలో ‘ఎ’ క్లాస్‌ రాళ్లతోపాటు, ‘బి’ క్లాస్‌లోని సరిహద్దు పాయింటర్స్‌, కూడళ్ల(జంక్షన్స్‌)కు, ప్రభుత్వ భూములకు, కొత్త కూడళ్లకు.. కలిపి మొత్తం నాలుగు రకాల రాళ్లు వినియోగించనున్నారు.

ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌కు ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకొని, ప్రభుత్వం రీసర్వే చేపడుతోంది. వీటికి 13 జిల్లాల్లో 51 గ్రామాలకు ‘ఎ’ క్లాస్‌ 362, ‘బి’ క్లాస్‌ 93,806 కలిపి మొత్తం 94,168 సర్వే రాళ్ల సరఫరా కోసం ఏపీఎండీసీ టెండర్లు పిలిచింది. ఒక్కో సర్వే రాయి ధర జీఎస్టీతో కలిపి రూ.450గా నిర్ణయించడంతో తొలుత ఎవరూ బిడ్లు వేయలేదు. తాజాగా ఒక్కో రాయి ధర రూ.475, జీఎస్టీ, రవాణా, లోడింగ్‌కు అదనపు ధర కోట్‌ చేసేలా అవకాశం కల్పిస్తూ మళ్లీ టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌ నాటికి ఈ రాళ్లను సిద్ధం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ... పోలవరం: వరద సమయంలో అధిక నీటిని ఒడిసిపట్టేలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.