- ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత- యూపీలో ముగిసిన నేతాజీ శకం
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెజ్లింగ్ రింగ్ నుంచి రాజకీయాల్లోకి ములాయం.. సీఎంగా ఎదిగి.. కేంద్రంలో చక్రం తిప్పి..
ఆయన ఓ సమాంతర ప్రజాస్వామ్య వేదికను సృష్టించారు. కాంగ్రెస్ వారసత్వాన్ని సవాల్ చేసి జాతీయ నేతగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ దూకుడుకు కళ్లెం వేసి.. తన శక్తియుక్తులతో వామపక్ష సిద్ధాంతాలను తిప్పికొట్టారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో తమగళం వినిపించేందుకు బాటలు వేశారు. రాష్ట్రాల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వాలు పరిశీలించే పరిస్థితులు తెచ్చారు. అంతటి ఛరిష్మ కలిగిన నాయకుడు.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నియోజకవర్గంలోని 94% ఓట్లు ఆయనకే.. దటీజ్ ములాయం!
దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణన్ వంటి మహా నేతల మార్గదర్శకత్వంలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న ములాయం.. యూపీ ప్రజలు ప్రేమగా నేతాజీ అని పిలుచుకునేంత ఖ్యాతినార్జించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "గర్జనలు దేనికోసం.. 3 రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతిపాలు చేయటానికా? "
వైకాపా సర్కారు మూడు రాజధానుల విధానంపై పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శనలు.., గర్జనసభలు పెడతామన్న అధికార పార్టీ నేతల తీరుపై ట్విట్టర్ వేదికగా పవన్ మండిపడ్డారు. మూడు రాజధానులతో ఆంధ్రప్రదేశ్ ను ఇంకా అధోగతి పాల్జేయడానికా అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరు అరెస్టు
దిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాల పరంపర కొనసాగుతోంది. ఈ కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అభిషేక్ బోయినపల్లిని సీబీఐ కోర్టులో హాజరుపరచనుంది. ఈ వివరాలను సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నేడే తెరాస, భాజపా అభ్యర్థుల నామినేషన్..
తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచి తెరాస, భాజపా అభ్యర్థులు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికలపై ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టినందున నామినేషన్ల కార్యక్రమం మునుగోడులో సాదాసీదాగానే నిర్వహించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెను విషాదం.. పడవ మునిగి 76 మంది మృతి
నైజీరియాలో జరిగిన పడవ ప్రమాదంలో 76 మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. 85 మందితో వెళ్తున్న పడవ ఒగ్బారూ ప్రాంతంలో వరదల కారణంగా ఒక్కసారిగా మునిగిపోవడమే ఇందుకు కారణం. పడవ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. జీవితకాల కనిష్ఠానికి రూపాయి
దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కోహ్లీ చేసిన ఆ రెండు సెంచరీలు నా ఫేవరెట్.. మళ్లీ ఆ మ్యాజిక్ చూడాలని ఉంది'
ఆధునిక క్రికెటర్లలో విరాట్ కోహ్లీని అధిగమించేవారెవరూ లేరని భారత మాజీ కోచ్ ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. అతడు అత్యంత పోటీతత్వ స్వభావం కలిగిన ఆటగాడని కొనియాడాడు. ఇంకా ఏమన్నాడంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అల్లు అర్జున్ 'పుష్ప' తగ్గేదేలే.. ఏడు కేటగిరీల్లో..
67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి ఎంతో వేడుకగా జరిగింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ఈ ఏడాది అత్యధికంగా అవార్డులు సొంతం చేసుకుంది. దక్షిణ భారత చలన చిత్రరంగంలో విశేషంగా భావించే 'ఫిలింఫేర్'అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. కరోనా పరిస్థితులతో గడిచిన కొన్నేళ్లు నిరాడంబరంగా జరిగిన ఈ వేడుక.. ఈ ఏడాది స్టార్ నటీనటుల సమక్షంలో ఘనంగా జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.