ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు@7am - టాప్​న్యూస్​ 7am

.

ap topnews
ఏపీ ప్రధానవార్తలు@7am
author img

By

Published : Sep 13, 2022, 7:04 AM IST

  • సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

సికింద్రాబాద్‌లో రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లాడ్జ్‌లో ఘటన జరిగింది. సెల్లార్‌లో ఎలక్ట్రికల్‌ ద్విచక్రవాహనాల బ్యాటరీలు పేలి మంటలు పైన ఉన్న లాడ్జీలోకి వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు.

  • రాజధాని రైతుల తొలిరోజు మహాపాదయాత్ర సాగిందిలా

ఏకైక రాజధాని సంకల్పంతో.. అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన మలివిడత పాదయాత్ర తొలిరోజు మహోద్యమంలా సాగింది. ఊరూవాడా, పిల్లా పెద్దా అంతా ఒక్కటై.. రైతులకు తోడుగా ముందుకు కదిలారు. వెంకటపాలెంలో ప్రారంభమైన తొలిరోజు పాదయాత్ర.. కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు మీదుగా సాగి మంగళగిరిలో ముగిసింది.

  • అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై గ్రామసభలు.. అంతా వ్యతిరేకతే..!

అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు తొలి రోజే చుక్కెదురైంది. మొదటి రోజు గ్రామసభలు నిర్వహించిన మూడు రాజధాని గ్రామాల ప్రజలు అమరావతిని మున్సిపాలిటీగా వ్యతిరేకించారు. ప్రజాభిపాయ సేకరణ తొలిరోజు ప్రశాంతంగా జరిగింది.

  • పాఠశాలల నిర్వహణలో.. ఇకపై సచివాలయ ఉద్యోగుల భాగస్వామ్యం

స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని రాష్టప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శించనుడగా... నెలకోసారి ఏఎన్‌ఎం సందర్శించనున్నారు. మండలస్థాయిలో ఉండే ఎంఈఓలో ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించాలని సీఎం ఆదేశించారు.

  • గోగ్రా- హాట్​స్ప్రింగ్స్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి.. అక్కడ మాత్రం..

గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌లో వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్‌ పాయింట్‌ (పీపీ)-15 నుంచి భారత్‌, చైనా బలగాలు సోమవారం వెనక్కి మళ్లాయి. దెమ్‌చోక్‌, దెప్సాంగ్‌ ప్రాంతాల్లో వివాదాలను పరిష్కరించుకునే అంశంలో ఎలాంటి పురోగతి లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

  • సోనాలి ఫోగాట్‌ హత్య కేసును సీబీఐకి అప్పగించిన కేంద్రం

నటి, భాజపా నాయకురాలు సోనాలి ఫోగాట్‌ హత్య కేసును సీబీఐకి అప్పగించింది కేంద్రం. గోవా పర్యటనలో భాగంగా సోనాలీ ఫోగాట్‌ ఆగస్టు నెలలో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. దీనిపై పలువురు నిందితులను ఇప్పటికే పనాజీ పోలీసులు అరెస్టు చేశారు.

  • 'అమ్మ బాటలోనే నా పయనం'.. పార్లమెంట్​లో బ్రిటన్​ రాజు తొలి ప్రసంగం

బ్రిటన్​కు నూతన రాజుగా ఎన్నికైన వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్​ పార్లమెంట్​ను ఉద్దేశించి ప్రసంగించారు. దివంగత రాణి, తన తల్లి ఎలిజబెత్​ను గుర్తు చేసుకున్న ఆయన.. పాలనలో ఆమె దారిలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేశారు. తన తల్లి నిస్వార్థ కర్తవ్య పాలనకు ఉదాహరణగా నిలిచారన్నారు. రాజుగా ఎన్నికైన తర్వాత ఛార్లెస్​ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు.

  • జియో నుంచి శాటిలైట్ సేవలు.. అనుమతులు జారీ చేసిన 'డాట్'!

శాటిలైట్‌ ద్వారా అంతర్జాతీయ మొబైల్‌ వ్యక్తిగత కమ్యూనికేషన్‌(జీఎమ్‌పీసీఎస్‌) సేవలను అందించడానికి జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) అందిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో లైసెన్స్‌డ్‌ సర్వీస్‌ ప్రాంతాల్లో జీఎమ్‌పీసీఎస్‌ సేవలను కంపెనీ ఏర్పాటు చేసి.. నిర్వహించుకోవచ్చు. మరోవైపు దేశంలోనే తొలిసారిగా హెచ్‌టీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ వాణిజ్య సేవలను ప్రారంభించినట్లు హ్యూజ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

  • టీ 20 ప్రపంచకప్​కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. టోర్నీకి జడేజా దూరం

ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్​ కప్​ కోసం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. పేసర్ బుమ్రా, ఆఖరి ఓవర్ల స్పెషలిస్ట్​ హర్షల్​ పటేల్​ను జట్టులోకి తీసుకున్నారు. మరో పేసర్ ఆవేష్​ ఖాన్​కు జట్టులో చోటు లభించలేదు. బౌలర్​ మొహమ్మద్​ షమీ తిరిగి టీమ్​లో అడుగుపెట్టాడు. శ్రేయస్ అయ్యర్​, రవి బిష్ణోయ్​, దీపక్ చాహర్​ను రిజర్వ్​ ప్లేయర్లుగా తీసుకున్నారు.

  • మణిరత్నం సినిమాను రిజెక్ట్​ చేసిన అమలాపాల్​.. కారణమిదే

మణిరత్నం పిలిచి మరీ అవకాశం ఇస్తానంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. తమ కెరీర్‌లో ఒక్కసారైనా ఆయన చిత్రంలో నటించాలని ఆశిస్తారు. పాత్ర చిన్నదా? పెద్దదా? అన్నది అస్సలు ఆలోచించరు. కానీ, అమలపాల్‌ మాత్రం మణిరత్నం చిత్రంలో చేయనని చెప్పిందట. అందుకు తానేమీ బాధపడటం లేదని కూడా చెప్పటం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.