- మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఖాతాదారులందరి సంస్థ..
గడిచిన 30 ఏళ్లుగా విజయవాడ ఎంజీ రోడ్డులోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ లబ్బిపేట బ్రాంచ్‌ను స్థానిక కళాంజలి షోరూమ్ కాంప్లెక్స్‌లోని నూతన సముదాయంలోకి మార్చారు. సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి దర్శనానికి 36 గంటలు..
వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్మెంట్లు నిండి బయటి వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు పడుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్నూలు జిల్లాలో కన్నతండ్రిని గొంతు కోసి చంపిన కుమారుడు..
కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం చోటు చేసుకుంది. తండ్రి గొంతు కోసి కుమారుడు దారుణహత్యకు పాల్పడ్డాడు. దిన్నెదేవరపాడుకు చెందిన బోయ ఎర్ర పుల్లయ్యను కుమారుడు బ్రహ్మ.. కోడుమూరు హంద్రీ వంతెన వద్ద హత్య చేసి పరారయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Malaikaja Sweet నెల్లూరు మధురమైన మలైకాజా మీరు తిన్నారా..
హైదరాబాద్ బిర్యానీ, బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు ఇలా చెప్పుకుంటే పోతే తెలుగు రాష్ట్రాల్లో అనేక వంటకాలు అద్భుత రుచికి పెట్టింది పేరు. ఇక నెల్లూరు అనగానే ఆహార ప్రియులకు చేపల పులుసు గుర్తుకొస్తుంది. ఈ జాబితాలో స్వీట్స్ ఇష్టపడేవారికి మాత్రం జైహింద్ మలైకాజానే మదిలో మెదులుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చేతిలో జాతీయ జెండాతో 9కిమీ ఈత, 6600 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర కోల్హాపుర్లోని శిరోల్ తాలుకాలో కొందరు స్విమ్మర్లు ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. కృష్ణామాయీ జల్తరణ్ మండల్‌కు చెందిన 20 మంది సభ్యులు మిరాజ్‌లోని కృష్ణా- వార్ణా నది సంగమం నుంచి శిరోల్ ఉద్గావ్ వరకు 9 కిలోమీటర్లు చేతిలో జెండా పట్టుకొని నదిలో ఈదుకుంటూ వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పెళ్లికి వెళ్తూ ఆరుగురు మృతి, ఐదుగురు ఒక కుటుంబానికి చెందినవారే..
ఎదురెదురుగా వస్తున్న కారు, టెంపో ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు రోడ్డు పక్కనే ఆగి ఉన్న డంపర్‌ను కారు ఢీకొట్టింది. గుజరాత్లో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీతారామం సినిమా స్టోరీకి ఆ ఉత్తరమే ఆధారమట..
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. ఈ ప్రేమ కథా చిత్రంలో హీరోహీరోయిన్ల నటనకు సినీప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా హిట్ టాక్‌తో ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో అన్నిచోట్ల మంచి వసూళ్లు సాధిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సచిన్ తొలి సెంచరీ ఎప్పుడు చేశాడో గుర్తుందా..
పరుగుల వరద ఎప్పుడు మొదలుపెట్టామన్నది కాదు, ప్రపంచ రికార్డులు దాసోహమయ్యాయా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు సాగింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కెరీర్. చాలా మంది క్రికెటర్లతో పోల్చుకొంటే సచిన్ తొలి శతకం కొంచెం ఆలస్యమే అయ్యింది. కానీ, తొలి శతకం తర్వాత వేటకు దిగిన పులిలా బౌలర్లపై విరుచుకు పడటం మొదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అధిక రాబడినిచ్చే ట్రేడింగ్ వ్యూహం ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్..
స్టాక్ మార్కెట్లో విజయం సాధించేందుకు ఎన్నో మార్గాలు, వ్యూహాలు ఉంటాయి. సూచీలు పెరుగుతున్న వేళ నిష్క్రియాత్మక పెట్టుబడి లేదా ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకోవడం ద్వారా రాబడిని ఆర్జించడం ఇప్పుడు చాలామంది పాటిస్తున్న వ్యూహం. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లను ఇందుకోసం ఎక్కువగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి..
చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన. ఆదివారం అబు సెఫీన్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.