ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ap top ten news

.

AP TOPNEWS
AP TOPNEWS
author img

By

Published : Aug 6, 2022, 5:00 PM IST

  • యువకుడు నారాయణది హత్యేనా..! తేల్చనున్న జాతీయ ఎస్సీ కమిషన్..
    నెల్లూరు జిల్లా కందమూరులో అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఉదయగిరి నారాయణ కేసును జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్​గా తీసుకుంది. అతడి మృతిపై వారంలోగా నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించినా.. వారు స్పందించకపోవటంతో నేరుగా రంగంలోకి దిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గోరంట్ల 'వీడియో' వ్యవహారంపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ..
    ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై తక్షణం విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని మహిళా కమిషన్‌ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి ఎంపీ గోరంట్లపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సూచించారు. మహిళాలోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె డీజీపీని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లొంగిపోయిన మావోయిస్టు..
    అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు దళ సభ్యురాలు జోగమ్మ లొంగిపోయారు. ఓఎస్‌డీ కృష్ణకాంత్‌ ఎదుట ఆమె లొంగిపోయారు. జోగమ్మ స్వస్థలం ఎటపాక మండలం సాలిబుడప. పోడియం జోగమ్మ అలియాస్‌ రితికపై రూ.లక్ష రివార్డు ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • "వ్యవసాయ విద్యుత్ మోటార్లకు.. మీటర్లు వద్దే వద్దు"..
    వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. మోటార్లకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అంటూనే ముఖ్యమంత్రి జగన్​.. రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం..
    బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. పట్నా రాంపుర్​ దియరా ఘాట్​ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. సోన్​ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్​ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పార్లర్​లో యువతిపై గ్యాంగ్​రేప్​.. మేనేజర్​, కస్టమర్ కలిసి..
    బ్యూటీపార్లర్​లో పనిచేస్తున్న ఓ యువతిపై పార్లర్​ మేనేజర్​తో పాటు కస్టమర్​ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, మహారాష్ట్రలో ఓ 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డు మీద పడేసి పారిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పవన్​పై నిర్మాత బండ్లగణేశ్ ట్వీట్​.. అలా చేయాలంటూ..
    పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు నిర్మాత బండ్ల గణేశ్‌ చిన్న విన్నపం చేశారు. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసే చిత్రాలతో పవన్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరారు. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ 'గబ్బర్‌సింగ్‌' లొకేషన్‌లో దిగిన కొన్ని ఫొటోలను శనివారం గణేశ్‌ షేర్‌ చేశారు. " పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బంగ్లా టైగర్స్‌పై విరుచుకుపడుతున్న జింబాబ్వే.. 9 ఏళ్ల తర్వాత తొలిసారి..
    జింబాబ్వే పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్​కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన బంగ్లా.. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ను సైతం ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్​కు సంబంధించిన కొన్ని ఆసక్తికర రికార్డులను తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Gold price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. క్రిప్టో కరెన్సీల జోరు!..
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి... దండయాత్ర కోసం చైనా ప్రాక్టీస్!..
    తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుతున్న వేళ.. తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మరోవైపు, తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్‌ సన్నాహాలు చేస్తోందని తైవాన్​ ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.