ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM - ఏపీ ముఖ్యవార్తలు

.

ap topnews
ap topnews
author img

By

Published : Aug 6, 2022, 3:01 PM IST

  • "ఎంపీ గోరంట్ల మాధవ్‌పై.. వైకాపా చర్యలు తీసుకోవాల్సిందే"..
    మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై.. వైకాపా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విచారకరమని తెలుగుదేశం విమర్శించింది. చేసిన నీచమైన పనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా కులాలపై గోరంట్ల దుమ్మెత్తిపోయడం హేయమైన చర్య అని తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లొంగిపోయిన మావోయిస్టు..
    అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు దళ సభ్యురాలు జోగమ్మ లొంగిపోయారు. ఓఎస్‌డీ కృష్ణకాంత్‌ ఎదుట ఆమె లొంగిపోయారు. జోగమ్మ స్వస్థలం ఎటపాక మండలం సాలిబుడప. పోడియం జోగమ్మ అలియాస్‌ రితికపై రూ.లక్ష రివార్డు ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • "వ్యవసాయ విద్యుత్ మోటార్లకు.. మీటర్లు వద్దే వద్దు"..
    వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. మోటార్లకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అంటూనే ముఖ్యమంత్రి జగన్​.. రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మానసిక రోగుల ఆహారంలో ఎలుక.. ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యం!..
    మానసిక రోగులకు అందించిన ఆహారంలో చనిపోయిన ఎలుక బయటపడింది. ఈ ఘటన ఝార్ఖండ్​ రాంచీలోని రిన్​పస్​ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనిపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సైకిల్​పై వెళ్తూ డ్రైనేజీలో పడ్డ బాలిక.. 2 గంటల రెస్క్యూ ఆపరేషన్​.. చివరకు...
    మురుగు నీటి కాల్వలో పడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది. మున్సిపల్ అధికారులు రెండు గంటలపాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినా ఫలితం లేకపోయింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బింబిసార- సీతారామం బ్యూటీస్​ హెవీ వర్కౌట్స్​.. చెమటలు పట్టిస్తున్నారుగా!..
    బింబిసార, సీతారామం చిత్రాలతో సక్సెస్​ అందుకున్న సంయుక్తా మేనన్​, మృణాల్​ ఠాకూర్​ మంచి జోష్​లో ఉన్నారు. సినిమాలోని వారి నటనకు, అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంయక్తమేనన్​ జిమ్​లో చెమటోడుస్తూ కసరత్తులు చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. దానితో సహా మృణాల్​ ఠాకూర్​కు సంబంధించిన జిమ్​ పిక్స్​ను ఓ సారి చూసేద్దాం... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దర్శకుడు శంకర్​, క్రికెటర్​ సురేశ్​రైనాకు గౌరవ డాక్టరేట్​..
    మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్​ఎన్​ రవి వీరిద్దరికీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Gold price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. క్రిప్టో కరెన్సీల జోరు!..
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి... దండయాత్ర కోసం చైనా ప్రాక్టీస్!..
    తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుతున్న వేళ.. తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మరోవైపు, తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్‌ సన్నాహాలు చేస్తోందని తైవాన్​ ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.