- ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎర్ర గంగిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూర చేయగా, దానిని రద్దు చేయాలని సీబీఐ తొలుత హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Kris city: క్రిస్ సిటీ పనులకు గుత్తేదార్ల నిరాసక్తి..
క్రిస్ సిటీ పనులు చేపట్టడానికి ఒక్క గుత్తేదారు సంస్థా ముందుకు రావడం లేదు. రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన పనులను దక్కించుకోవడానికి గుత్తేదార్లు పోటీ పడాల్సింది పోయి.. బిడ్లు దాఖలు చేయడానికి ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రైల్వే నియామకాల్లో క్రమంగా కోత.. క్లర్కు పోస్టుల భర్తీ చేపట్టొద్దని బోర్డు ఆదేశాలు..
రైళ్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన విభాగాల్లో తప్ప మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా క్లర్కులను నియమించకుండా చూడాలని డివిజన్ అధికారులను బోర్డు ఆదేశించింది.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఉద్యోగులపై ప్రభుత్వం అప్రకటిత యుద్ధం.. షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లతో వేధింపులు..
సీపీఎస్ స్కీమ్‌తో లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టారని ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి మండిపడ్డారు. ఈ విధానాన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు జీపీఎస్ అమలు చేస్తామని చెబితే ఒప్పుకోవడానికి, నమ్మడానికి ఇక్కడ అమాయకులు ఎవరూ లేరని హెచ్చరించారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్రపతిగా నా ఎన్నిక.. దేశ పేదలందరి విజయం: ముర్ము..
భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం తన ఒక్కరి ఘనత కాదని.. దేశ ప్రజలందరి విజయమని అన్నారు ద్రౌపదీ ముర్ము. పేదలు కలలు కనొచ్చని, వాటిని నిజం చేసుకోవచ్చని చెప్పేందుకు తన ఎన్నికే నిదర్శనం అన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కలియుగ శ్రవణుడు.. అమ్మానాన్నలను భుజాలపై మోస్తూ వందల కి.మీ. యాత్ర..
హరిద్వార్‌లో పవిత్ర గంగా స్నానం ఆచరించి, కావడి యాత్ర పూర్తి చేయాలన్నది ఆ వృద్ధుల కల. కానీ.. వయసు ఏమాత్రం సహకరించడం లేదు. వందల కిలోమీటర్ల దూరం నడిచే శక్తి లేదు. అయినా.. వారి కోర్కెను తీర్చేందుకు కలియుగ శ్రవణ కుమారుడిలా మారాడు వారి కొడుకు. ఇద్దరినీ కావడిలో కూర్చోబెట్టి, భుజాలపై మోస్తూ.. వారి కల సాకారం చేశాడు.పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంటకు చంపేస్తామని బెదిరింపులు..
బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌కు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Commonwealth Games: కామన్వెల్త్ క్రీడల్లో మన ఆశాకిరణాలు వీరే..
మరో వారంలో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభంకానున్నాయి. లండన్‌లోని బర్మింగ్హమ్ వేదికగా జరిగే ఈ పోటీల్లో సత్తా చాటేందుకు భారత్ తరపున పలువురు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. వివిధ విభాగాల్లో భారత ఆటగాళ్లు కామన్వెల్త్ పోటీల్లో ఉన్నా.. కొందరిపై మాత్రం క్రీడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి వారెవరు? ఇది వరకు వారి రికార్డులు ఏంటో చూద్దామా?. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర నేటి లెక్కలు ఇలా...
Gold Price Today: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మయన్మార్‌లో నలుగురు రాజకీయ నేతలకు ఉరి.. 50 ఏళ్ల తర్వాత..!..
మయన్మార్ సైన్యం నలుగురికి ఉరిశిక్ష వేసింది. అందులో మాజీ మాజీ చట్టసభ్యుడు, మరొక సామాజిక కార్యకర్త ఉన్నారు. పూర్తి కధనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి