- స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్ చర్చ!
అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక పై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దు
రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ మరింత ముదురుతోంది. ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు అధికారులతో నిర్వహించ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ రెండోరోజు రద్దయ్యింది. సమావేశం ఏర్పాటుకు ఎస్ఈసీ రమేశ్‌కుమార్ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో నేడు జరగాల్సిన వీడియోకాన్ఫరెన్స్ రద్దయ్యింది. దీనిపై ఎన్నికల కమిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- శుక్రవారం నుంచే తుంగభద్ర పుష్కరాలు...ఈ- టికెట్ తప్పనిసరి!
తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి డిసెంబర్ 1 వరకూ జరిగే పుష్కరాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో నదీ స్నానాలను నిషేధించిన ప్రభుత్వం.. కేవలం నీటిని తలపై జల్లుకోవాలని సూచిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కొత్తగా 1,316 కరోనా కేసులు, 11 మరణాలు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,316 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,58,711కు చేరింది. మరణాల సంఖ్య 6,910కి పెరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'అయోధ్య' కోసం రాజస్థాన్ సర్కార్ మైనింగ్ అనుమతులు
అయోధ్య రామ మందిర నిర్మాణంలో వినియోగించే రాతి తవ్వకాలకు రాజస్థాన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగానే అనుమతుల్లో ఇన్ని రోజులు జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు- మళ్లీ కర్ఫ్యూ భయాలు
దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మరింతగా విజృంభిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర బృందాలు.. పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాలు/నగరాలు మళ్లీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని నగరాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆరోగ్య మంత్రిపై కరోనా టీకా ప్రయోగం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తనపై ప్రయోగించుకునేందుకు సిద్ధమయ్యారు హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అంబాలా కాంట్ సివిక్ ఆస్పత్రిలో టీకా తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ఇద్దరు స్టార్‌హీరోల సినిమాలో పైలట్‌గా రకుల్
కొంతకాలంగా బాలీవుడ్‌పై దృష్టిసారించిన సొగసరి భామ రకుల్ ప్రీత్ సింగ్.. మరో ఆఫర్ కొట్టేసింది. ఈసారి అమితాబ్, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కనువిందు చేయనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'కోహ్లీ గైర్హాజరు ఆ ఇద్దరికి మంచి అవకాశం'
ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ(నెం.4) స్థానంలో క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను దింపడం మంచిదని అభిప్రాయపడ్డాడు సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్. కాగా, విరాట్ ఈ సిరీస్‌కు దూరమవ్వడం రాహల్‌తో పాటు పుజారాకు గొప్ప అవకాశమని చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- కరోనా వాస్తవ కేసుల సంఖ్య 6.2 రెట్లు అధికం!
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య.. వాస్తవానికి చాలా తక్కువని తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. అధికారికంగా గుర్తించిన కేసులతో పోలిస్తే వైరస్ వ్యాప్తి 6.2 రెట్లు అధికమని తేలింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.