ETV Bharat / city

ap topnews ఏపీ ప్రధానవార్తలు@11am - ఆంధ్రప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

.

ap topnews
ఏపీ ప్రధానవార్తలు11am
author img

By

Published : Oct 5, 2022, 11:00 AM IST

  • ఇక రుణ యాప్​ల ఆట కట్టు.. కేంద్రం ఆదేశాలతో పోలీసుల వేట మొదలు..

లోన్ యాప్ నిర్వాహకుల మోసాలకు, వేధింపులకు జనం బలవుతున్న నేపథ్యంలోకేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. లోన్ యాప్‌లను కట్టడి చేయాలని రాష్ట్రాలను ఆదేశించడంతో.. రాష్ట్ర పోలీసులు కూడా ఇప్పుడు బాధితుల ఫిర్యాదులపై దృష్టి సారిస్తున్నారు. కడప పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా చెన్నై, రాజస్థాన్ కు చెందిన ముఠా నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ముఠా గుట్టును వై.ఎస్.ఆర్.జిల్లా పోలీసులు రట్టు చేశారు.

  • కాన్పు చేసిన ఫోటోలను.. ఆ పార్టీ వాట్సప్ గ్రూపులో షేర్ చేసిన వైద్యుడు...

వైద్యో నారాయణ హరి అంటారు.. వైద్యుడు దైవంతో సమానం అన్నారు మన పెద్దలు.. వైద్యుడి దగ్గర ఏది దాచకూడదంటారు. అయితే ఆ వైద్యుడు కాన్పు కోసం చ్చిన మహిళ ఫోటోలను ఆరోగ్య శ్రీ యాప్​లో అప్లోడ్ చేయాల్సి ఉండగా.. ఓ పార్టీకి చెందిన వాట్సప్ గ్రూప్​లో షేర్ చేశాడు. ఫోటోలు వైరల్ కావడంతో స్పందించిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విచారణ ప్రారంభించి చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

  • సరికొత్త అధ్యాయం లిఖించిన తెరాస పార్టీ.. దేశవ్యాప్తంగా విస్తరించనున్న గులాబీ జెండా

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సరికొత్త అధ్యాయం లిఖించనుంది. గులాబీ జెండా దేశానికి విస్తరించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, పునర్నిర్మాణం ధ్యేయంగా 21 ఏళ్ల క్రితం ఏర్పాటైన తెరాస... జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రే ధ్యేయంగా రూపాంతరం చెందనుంది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్​ సిద్ధమయ్యారు. ఈ దిశలో కొన్ని నెలల నుంచి కసరత్తు జరుగుతుండగా... విజయదశమి సందర్భంగా లాంఛనం పూర్తి కానుంది.

  • శ్రీకాళహస్తి ఘటనపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్..

హోటల్ నిర్వాహకురాలు ధనలక్ష్మిపై శ్రీకాళహస్తి సీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ధనలక్ష్మిపై దాడి చేసిన పోలీసులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని.. డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు.

  • పోలీస్ హత్యకు రెండు రోజుల్లోనే రివెంజ్- నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకడ్ని.. దక్షిణ కశ్మీర్​ షోపియాన్ జిల్లాలోని మోలూ ప్రాంతంలో భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. జైషే మహ్మద్ ముష్కర మూకకు చెందిన మరో ముగ్గుర్ని డ్రాచ్ ప్రాంతంలో హతమార్చారు.

  • నవమి రోజున జాక్​పాట్​.. ఒక్క వజ్రంతో రాత్రికిరాత్రే లక్షాధికారిగా..

భారతదేశంలోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో అరుదైన వజ్రం బయటపడింది. నవమి రోజున దొరికిన ఈ అరుదైన వజ్రం నొయిడాకు చెందిన రాణా ప్రతాప్​ను​ రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. పన్నా గనుల్లో మరో అరుదైన వజ్రం తమ గనిలో దొరికిందని గని యజమాని సంబరాలు చేసుకుంటున్నాడు.

  • నిన్న కిమ్​ పాస్.. ఈరోజు దక్షిణ కొరియా ఫెయిల్..

మిస్సైల్​ రేస్​లో దక్షిణ కొరియా తడబడింది. బుధవారం ఆ దేశం చేపట్టిన క్షిపణి పరీక్ష విఫలమైంది. మంగళవారం ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్​ క్షిపణికి కౌంటర్​ ఇద్దామనుకున్న దక్షిణ కొరియా-అమెరికా కూటమికి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పూర్తి వివరాల కోసం స్క్రోల్ డౌన్​/స్వైప్ లెఫ్ట్.

  • బుమ్రా స్థానంలో ఎవరు అన్నది అప్పుడే నిర్ణయిస్తాం: రోహిత్‌

టీ20 ప్రపంచకప్​కు ముందు భారత క్రికెట్​ జట్టుకు జస్ప్రీత్​ బుమ్రా దూరమవ్వడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అయితే ఈ స్టార్ బౌలర్​ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న చర్చ సర్వత్రా మొదలైంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని గావస్కర్​ లాంటి మాజీలు ఇటీవలే అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు.

  • ఎయిర్​పోర్ట్​లో కరీనా​కు చేదు అనుభవం.. సెల్ఫీ కోసం ఒక్కసారిగా భుజంపై చేయి..

ముంబయి ఎయిర్​పోర్ట్​లో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్​కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. ఒక అభిమాని సెల్ఫీ కోసం ఆమె భుజానికి అడ్డంగా చేయి వేయబోయాడు. దీంతో కరీనా ఒక్కసారిగా భయపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.