ETV Bharat / city

ప్రధానవార్తలు@ 7AM - నేటి ప్రధానవార్తలు

..

7AM TOPNEWS
ప్రధానవార్తలు@ 7AM
author img

By

Published : Jul 25, 2022, 6:59 AM IST

  • ప్రైవేటు బడులకు పుస్తకాలెక్కడ?.. మార్కెట్‌లో దొరక్క తల్లిదండ్రుల అవస్థలు!

ప్రైవేటు పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ నిబంధన తెచ్చిన పాఠశాల విద్యాశాఖ.. సరఫరాపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. దీంతో పాఠ్యపుస్తకాలు లేకుండానే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.. పాఠశాలలు పునఃప్రారంభించి మూడు వారాలు కావొస్తున్నా ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు 'అక్రమంగా' ఇసుక.. వయా వత్సవాయి!

రాష్ట్రం నుంచి ఇసుక లోడుతో ఉన్న లారీలు హైదరాబాద్​కు భారీగా తరలివెళ్తున్నాయి. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులోని గరికపాడు తనిఖీ కేంద్రం దాటితే వాటిని అడ్డుకునేవారే ఉండటం లేదు. దీంతో జాతీయ రహదారి పక్కనున్న మండలమైన వత్సవాయిలోని గ్రామాలకు ఇసుక సరఫరా చేస్తున్నామని వే బిల్లుల్లో చూపించి.. అటు నుంచి అటే హైదరాబాద్‌ తరలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • ఆహార భద్రత కార్డుల్లో భారీ మార్పుచేర్పులు.. ఉత్తరాంధ్ర, సీమలో అధికంగా!

జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున మార్పుచేర్పులు చేసింది. మొత్తం కార్డులు, లబ్ధిదారుల సంఖ్యను గతంలో మాదిరిగా కొనసాగిస్తూనే.. జిల్లాల పరిధిలో మార్పులు చేసింది. జులై వరకు ప్రతి జిల్లాలో సగటున 50 నుంచి 60% కార్డులు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్నాయి. ఆగస్టు నుంచి 12 జిల్లాల్లో వాటిని 30% కన్నా తగ్గించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • ఆటోను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

కర్నూలు సమీపంలోని వెల్దుర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి డోన్ వైపు వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టగా.. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం.. ఆదివాసీ సంప్రదాయాలతో వైభవంగా..

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు (సోమవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ.. ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సైనికులు.. ముర్ముకు '21 గన్ సెల్యూట్' సమర్పిస్తారు. సైనిక వందనం స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి హోదాలో ముర్ము ప్రసంగిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • 'పర్యావరణాన్ని కాపాడుకుందాం.. సామాన్యులే నిజమైన దేశ నిర్మాతలు'

ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు భారత్ సిద్ధమవుతోందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి కోవింద్ ప్రసంగించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • అమెరికాలో అరుదైన కేసు.. ఒకే వ్యక్తికి కరోనా, మంకీపాక్స్!

ప్ర‌పంచ దేశాల్ని మంకీపాక్స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇండియాలోనూ నాలుగు కేసులు వెలుగుచూశాయి. కాగా, అమెరికాలో ఓ అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే వ్య‌క్తికి ఏక‌కాలంలో మంకీపాక్స్‌, క‌రోనా వైర‌స్ సోకాయి. మరోవైపు మంకీపాక్స్‌ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమై..ప్రపంచ ప్రజాఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • ఇన్ఫోసిస్‌ క్యూ1 లాభం రూ.5,360 కోట్లు.. గతేడాది కంటే 3.2% అధికం

సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, జూన్‌ త్రైమాసికానికి రూ.5,360 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.5,195 కోట్ల కంటే ఇది 3.2% అధికం. అయితే ఆర్థిక అనిశ్చితి వాతావరణంలోనూ పటిష్ఠ ఫలితాలు ప్రకటించడం ఇన్ఫోసిస్‌ సామర్థ్యాలకు నిదర్శమని సంస్థ ఎండీ సలీల్‌ పరేఖ్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • దంచికొట్టిన అక్షర్​ పటేల్​.. టీమ్​ఇండియా మరో సిరీస్​ కైవసం

వెస్టిండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇంకో మ్యాచ్‌ ఉండగానే ట్రోఫీ కైవసం చేసుకుంది. భారత జట్టులో అక్షర్‌ పటేల్‌(64 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌(63), సంజు శాంసన్‌(54) అర్ధసెంచరీలతో చెలరేగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

  • గుర్తుపట్టిన ఫ్యాన్స్​.. భయంతో పరిగెత్తిన షారుక్​!

సాధారణంగా తమ అభిమాన నటులు, హీరోహీరోయిన్లు కనిపిస్తే ఫ్యాన్స్​కు వచ్చే ఉత్సాహమే వేరు. సెల్ఫీలు అంటూ ఎగపడతారు. కొన్ని సందర్భాల్లో తెలీకుండానే సెలబ్రిటీలను ఇబ్బందికీ గురిచేస్తారు. ఒక్కోసారి వారి అభిమానం చూసి తారలు తప్పించుకుంటుంటారు. అయితే తాజాగా షారుక్​ కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్​ను చూసిన బాలీవుడ్​ బాద్​షా.. ఒక్కసారిగా వారి నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.