ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీ ఎస్.శ్రీకంఠనాథ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన.. ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ తరపున 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మధ్యంతర డివిడెండ్ రూ.5,02, 37, 898 చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసుధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'