రాష్ట్రం అప్పుల ఆసరాతోనే నడుస్తోంది. మొదటి అర్ధసంవత్సరం రాష్ట్ర ఖజానా లెక్కలు పరిశీలిస్తే రెవెన్యూ ఆదాయం కన్నా అప్పుల మొత్తమే ఎక్కువగా ఉంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ తొలి ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో రెవెన్యూ రూ.44,915 కోట్లకు పైగా ఉండగా.......అదే సమయంలో చేసిన అప్పు 55 వేల 169 కోట్ల రూపాయలకు పైనే ఉంది. రాష్ట్రం చేసిన ఖర్చులో సగం కన్నా ఎక్కువ మొత్తం అప్పు రూపంలో తీసికొచ్చి చేసిందే.
ఏడాది మొత్తం మీద లక్షా 61 వేల 958 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ సాధిస్తామని బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే మొదటి ఆరు నెలల్లో కేవలం ఇందులో 27.73 శాతం మాత్రమే సాధించగలిగారు. దీంతో రాష్ట్ర ఆదాయాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కేంద్రం నుంచి సాయం రూపంలో కూడా పెద్ద మొత్తంలో వస్తుందని లెక్కల గట్టి బడ్జెట్ రూపొందించగా...అందులోనూ కేవలం నాలుగో వంతు మాత్రమే దక్కింది.
ఇదీ చదవండి : కొవిడ్ అనంతరం కొత్త భారత్ : చంద్రబాబు