విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ఈనెల 14న దిల్లీ వెళ్లనున్నట్లు రాష్ట్ర భాజపా నేతలు తెలిపారు. ప్రజల ఆందోళనలను దిల్లీ వెళ్లి జాతీయ కమిటీని కలిసి విన్నవిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. నోటా పోర్టీ అంటూ నోరు పారేసుకోవద్దని మంత్రి వెల్లంపల్లికి సోము వీర్రాజు హెచ్చరించారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని తాను చెప్పలేదని.. వీర్రాజు వివరణ ఇచ్చారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఆ శాఖ మంత్రిని కలుస్తామని భాజపా ఎంపీ జీవీఎల్ అన్నారు. దేశంలోని పరిశ్రమలపై విధానపర నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు ధరలపై ఆలోచించాలన్నారు. కేంద్రంతో రాష్ట్రాలకు అవగాహన లేకనే పెట్రోల్ ధరల పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదిస్తే రాష్ట్రాలు అంగీకరించలేదని.. పెట్రోల్‌పై విధించే సెస్సును రాష్ట్రాలు తగ్గించుకోవాలని కోరారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో సెస్సును తగ్గించినట్లు.. అన్ని రాష్ట్రాలు ఆలోచించాలని జీవీఎల్ సూచించారు.
ఇదీ చదవండి: 'ఇలా ఎలా జరిగిందో చెప్పండి.. నివేదికలు పంపండి'