ETV Bharat / city

ఆహార భద్రత ప్రమాణాల్లో .. ఏపీ కి 17వ స్థానం

Food standards: ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం, హైజీన్‌ రేటింగ్‌లో తెలుగు రాష్ట్రాల హోటళ్లు, వ్యాపార సంస్థలు వెనుకబడ్డాయి. రాష్ట్రాలవారీగా ఆహార భదత్రశాఖల పని తీరును 2021-22 ఆర్థిక సంవత్సరానికి పరిశీలించినప్పుడు తెలంగాణ 15, ఏపీ 17వ స్థానానికి పరిమితమయ్యాయి.

ap stands in 17th place in food standards
అట్టడుగున ‘ఆహార భద్రత’.. 17వ స్థానంలో రాష్ట్రం
author img

By

Published : Jul 24, 2022, 10:17 AM IST

Food standards: ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం, హైజీన్‌ రేటింగ్‌లో తెలుగు రాష్ట్రాల హోటళ్లు, వ్యాపార సంస్థలు వెనుకబడ్డాయి. హోటళ్లు, స్వీట్‌ షాపులు, బేకరీలు, చికెన్‌, మటన్‌ దుకాణాల్లో పరిశుభ్రతను కొలమానంగా తీసుకుని కేంద్ర ఆహార భద్రతా విభాగం రాష్ట్రాలకు రేటింగ్స్‌ ఇస్తోంది. వ్యాపారులు తాము పాటిస్తున్న పరిశుభ్రతల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే వాటిని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ మదింపు చేయించి హైజీన్‌ రేటింగ్స్‌ను ఇస్తుంది. తాజాగా.. దేశవ్యాప్తంగా 22,800 ఆహార, ఇతర వ్యాపార సంస్థలు హైజీన్‌ రేటింగ్స్‌ను పొందాయి.

హైజీన్‌ రేటింగ్‌ పొందేందుకు ఆయా వ్యాపార సంస్థలు ఉత్సాహాన్ని చూపడం లేదు. రేటింగ్‌ పొందాలనుకున్న సంస్థలు విధిగా ఫుడ్‌ లైసెన్సు పొందాలి. సంబంధితశాఖ ద్వారా ఫుడ్‌ సేఫ్టీపై శిక్షణ పొందాలి. పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించడంతోపాటు వినియోగదారులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, నీటిని ఏడాదికి రెండు సార్లు పరీక్ష చేయించాలి. సిబ్బంది ఆరోగ్య వివరాలను నమోదు చేయాలి. డ్రెస్‌కోడ్‌ పాటించాలి. ఈ నిబంధనలన్నీ పాటించేందుకు సంస్థలకు రూ.10వేల వరకు ఖర్చవుతుంది. దీంతో వీటివైపు చాలా సంస్థలు దృష్టి పెట్టడం లేదు.

దేశవ్యాప్తంగా ఇలా.. రాష్ట్రాలవారీగా ఆహార భదత్రశాఖల పని తీరును 2021-22 ఆర్థిక సంవత్సరానికి పరిశీలించినప్పుడు తెలంగాణ 15, ఏపీ 17వ స్థానానికి పరిమితమయ్యాయి. మానవ వనరులు, హోటళ్లకు ఫుడ్‌ సేఫ్టీ లైసెన్సులు, నమూనాలను పరీక్షించే ల్యాబ్‌ల సామర్థ్యం, వినియోగదారుల్లో అవగాహన వంటి కొలమానాల ప్రాతిపదికన రాష్ట్రాలకు మార్కులను కేంద్రం కేటాయించింది. 82.5 మార్కులతో తమిళనాడు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గుజరాత్‌ (77.5), మహారాష్ట్ర (70 మార్కులు) తరువాతి స్థానాల్లో నిలిచాయి. 34.5 మార్కులతో తెలంగాణ 15వ స్థానం, 30 మార్కులతో బిహార్‌ 16వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ కేవలం 26 మార్కులే సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.