ETV Bharat / city

'ప్రైవేట్ వ్యక్తులు కీలక హోదాల్లో ఉంటే.. తప్పులు జరిగినప్పుడు ఎవర్ని బాధ్యులను చేస్తారు' - ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం

ASPA PROTEST: సచివాలయంలో ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీల పోస్టుల్లో ప్రైవేట్ వాళ్లని రిక్రూట్ చేసుకోవడాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. శాఖల్లో చాలా ఖాళీలున్నాయని, పదోన్నతులూ పెండింగ్​లో ఉన్నాయని గుర్తుచేశారు. వాటిని భర్తీ చేయకుండా ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులను రిపోర్ట్ చేయమనడం సబబు కాదని పేర్కొన్నారు.

ASPA PROTEST
జాయింట్ సెక్రటరీల పోస్టుల్లో ప్రైవేట్ వాళ్లని రిక్రూట్ చేసుకోవడాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం వ్యతిరేకత
author img

By

Published : May 18, 2022, 3:07 PM IST

ASPA PROTEST: సచివాలయంలో ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీల పోస్టుల్లో ప్రైవేట్ వాళ్లని రిక్రూట్ చేసుకోవడాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఉన్నత స్థాయిలో ప్రైవేటు వ్యక్తుల తాత్కాలిక నియామకం సర్వీస్​ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. శాఖల్లో చాలా ఖాళీలున్నాయని, పదోన్నతులూ పెండింగ్​లో ఉన్నాయని గుర్తుచేశారు. వాటిని భర్తీ చేయకుండా ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులను రిపోర్ట్ చేయమనడం సబబు కాదని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులను.. ప్రైవేట్ వాళ్లకు రిపోర్ట్ చేయమని చెప్పడం సర్వీస్ రూల్స్​కు విరుద్ధమని స్పష్టం చేశారు. నిపుణుల అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తే.. వేరే వాళ్ల సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రైవేట్ వ్యక్తులు కీలక హోదాల్లో ఉంటే తప్పులు జరిగినప్పుడు ఎవర్ని బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి అయితే భయంతో.. బాధ్యతతో పని చేస్తారని.. ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి బాధ్యత ఉండదని చెప్పారు. జాయింట్ సెక్రటరీ హోదాలో ప్రైవేట్ వ్యక్తులను నియమించడం అంటే సమాంతర వ్యవస్థ సృష్టించినట్టే అని అభిప్రాయపడ్డారు.

ఇదీ జరిగింది : రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కార్యాలయం సచివాలయం. అక్కడ నిబంధనల ప్రకారమే ప్రతి దస్త్రం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విభాగాధిపతుల నుంచి వచ్చే ప్రతి అంశాన్నీ అక్కడ వివిధ స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను పేర్కొంటూ దానిని కార్యదర్శి స్థాయికి పంపిస్తారు. అక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయా అవసరాలను బట్టి పంపి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి కీలక సచివాలయంలో ప్రస్తుతం ఆర్థికశాఖలో జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శాఖలో 5 జాయింట్‌ సెక్రటరీ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.

సాధారణంగా ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ తరహా పరీక్షల్లో ఎందరో పోటీపడి ఎంపికై సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్‌ స్థాయిలో లేదా ఆ పై స్థాయిలో నియమితులవుతుంటారు. ఆ తర్వాత 20ఏళ్ల పాటు ఆయా పోస్టుల్లో పని చేస్తూ పదోన్నతుల ద్వారా జాయింట్‌ సెక్రటరీ గ్రేడ్‌కు చేరుతుంటారు. అలాంటిది కేవలం నేరుగా ఈ పోస్టులో అదీ ఆర్థికశాఖలో ప్రైవేటు కంపెనీల్లో అనుభవం ఉన్న వారిని నియమిస్తుండటం వివాదాస్పదమవుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర ఆర్థికశాఖలోని ఒక ఉన్నతాధికారిని కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ప్రైవేటు వ్యక్తులను కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శులకు కన్సల్టెంట్లుగా లేదా ప్రత్యేకాధికారులుగా నియమించుకునే వారని, ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగించాలని కోరారు. దస్త్రం సర్కులేట్‌ చేసే అధికారం ఉన్న పోస్టులోకి ఇలా ప్రైవేటు వ్యక్తులను తీసుకురావడం సరికాదని వాదించారని సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.