విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై మంత్రి బాలినేని సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జలతోపాటు విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి నేతలు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతిపాదించిన 19 డిమాండ్లపై సమావేశంలో చర్చించారు.
ఉద్యోగులపై నమోదైన కేసులు వెనక్కి తీసుకోవాలని జేసీసీ నేతలు కోరారు. డిస్కమ్‌లలో కొత్త సేవా నిబంధనలు ఉపసంహరించాలని.. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒప్పంద సిబ్బందిని క్రమబద్ధీకరించటంతోపాటు.. విద్యుత్ మీటర్ రీడర్ల సేవలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా!