ETV Bharat / city

ఎన్నికల నిర్వహణకు జాప్యం ఎందుకు..? - municipal elections in ap

పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదంటూ... రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కారణాలేంటో చెప్పాలని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరునూ న్యాయస్థానం తప్పుబట్టింది. కాలపరిమితి దాటినా ప్రత్యేక అధికారులను కొనసాగించడం ఏంటని ప్రశ్నించింది.

ఎన్నికల నిర్వహణకు జాప్యం ఎందుకు..?
author img

By

Published : Nov 8, 2019, 7:11 AM IST

ఎన్నికల నిర్వహణకు జాప్యం ఎందుకు..?

పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో పూర్తిచేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించినా... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గతేడాది అక్టోబర్‌ 28న ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పక్కన పెట్టారని నిలదీసింది. అందుకు కారణాలేంటని... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయి... ఎందుకు నిర్వహించలేదన్న అంశంపై ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రమాణపత్రం దాఖలులో విఫలమైతే... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరునూ న్యాయస్థానం తప్పుబట్టింది. కాలపరిమితి దాటినా ప్రత్యేక అధికారులను కొనసాగించడం ఏంటని ప్రశ్నించింది.

రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల కమిషన్... హైకోర్టుకు నివేదించింది. సర్పంచులు, వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత... ప్రక్రియ పూర్తిచేయడానికి 60 రోజుల సమయం అవసరమని తెలిపింది. రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం జాప్యం చేస్తే... కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్రంలోని 12వేల 775 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా... ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు... ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత... పంచాయతీలను బలోపేతం చేసేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. 3 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు పూర్తవగానే... పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండీ... ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.