ETV Bharat / city

రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు: హైకోర్టు - ఏపీలో ప్రభుత్వ భూములు వార్తలు

రాష్ట్రంలో భూ కేటాయింపుల తీరును ధర్మాసనం ఆక్షేపించింది. ఇష్టారీతిగా భూములను కేటాయించుకుంటూ పోతే ప్రభుత్వ భూములు మిగిలేందుకు తావుండదని పేర్కొంది

హైకోర్టు
author img

By

Published : Nov 14, 2019, 6:54 AM IST

ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయించేందుకు ఓ విధానం అంటూ లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇష్టంవచ్చినట్లు భూమి కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించింది. దేనికోసం భూమి తీసుకుంటున్నారో తెలుసుకుంటున్నారా? అని అధికారుల్ని ప్రశ్నించింది. విశాఖ జిల్లా యండాడ గ్రామ పరిధిలో ఓ సంస్థకు 2.11 ఎకరాలు భూమి కేటాయిస్తూ 2018 ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోను సవాలుచేస్తూ చైతన్య అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా భూ కేటాయింపుల తీరును ధర్మాసనం ఆక్షేపించింది. భూ కేటాయింపుల విషయంలో రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదని ఇష్టారీతిగా భూములను కేటాయించుకుంటూ పోతే ప్రభుత్వ భూములు మిగిలేందుకు తావుండదని పేర్కొంది. భూ కేటాయింపులపై లోతైన విచారణ జరిపేందుకు అమికస్ క్యూరీని నియమించామని గుర్తుచేసింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో మిన్నల్ అదిమూలం రత్నమ్మ ఛారిటబుల్ ట్రస్టు (ఎంఏఆర్ఎస్)కు 6.88 ఎకరాల భూ కేటాయింపుపై ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనలకు అనుగుణంగా భూ కేటాయింపు జరగలేదని కోర్టుకు తెలిపారు . భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. డిసెంబర్ 12న ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి

"మనబడి నాడు-నేడు"కు ఇవాళ సీఎం జగన్ శ్రీకారం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.