ETV Bharat / city

చెన్నై ఆస్తి వ్యవహారం కేసులో.. అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట

author img

By

Published : Apr 27, 2022, 4:50 AM IST

AP High Court: చెన్నై ఆస్తి వ్యవహారం కేసులో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్​ అశోక్ గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్​కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను నిలుపుదల చేసిన ధర్మాసనం.. విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.

AP High Court on Ashok Gajapatiraju
AP High Court on Ashok Gajapatiraju

మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌కు... హైకోర్టులో ఊరట లభించింది. చెన్నైలోని మైలాపూర్‌ భూమికి సంబంధించిన దస్త్రాలతో హాజరు కావాలంటూ ఈడీ ఇచ్చిన సమన్లను ధర్మాసనం నిలుపుదల చేసింది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి వివాదంలో ఈడీ ఎలా జోక్యం చేసుకుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏ వివరాల ఆధారంగా పిటిషనర్లపై ఈసీఐఆర్​ నమోదు చేశారో చెప్పాలని ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ విచారణను జూన్ 21కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఇదీ చదవండి: వసతిగృహాల నిర్వహణ ఇలాగేనా?..ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.