విశాఖలో ప్రతిపక్ష నేత చంద్రబాబును అడ్డుకోవటంపై మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లో చంద్రబాబును అడ్డుకోవటం ప్రభుత్వ మతిలేని చర్య అని రాయటంపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అలా అనటం సరికాదన్నారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం మతిలేని చర్యలు చాలానే చేస్తోందని వ్యాఖ్యానించింది. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రాజధానిని మార్చాలనుకోవటం మతిలేని చర్య కాదా అని ప్రశ్నించిందని న్యాయవాది శ్రవణ్ కుమార్ వెల్లడించారు. న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి