ETV Bharat / city

సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై విచారణ జూన్​ 22కి వాయిదా - high court orders on crda act cancellation

సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై సీఎస్​, మండలి కార్యదర్శికి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను జూన్​ 22కి వాయిదా వేసింది.

సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులపై విచారణ జూన్​ 22కి వాయిదా

author img

By

Published : May 26, 2020, 3:48 PM IST

సీఆర్‌డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. శాసనమండలి కార్యదర్శి, ఛైర్మన్ ఆదేశాలను పాటించేలా ఆదేశాలివ్వాలన్న తెదేపా ఎమ్మెల్సీ దీపక్​ రెడ్డి పిటిషన్​పై విచారించిన ధర్మాసనం.. ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

మండలి ఆదేశాలను ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదని.. శాసనమండలి ఛైర్మన్​ ఆదేశాలను పాటించాల్సిందేనని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మండలి కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను జూన్​ 22కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి..

దేవాలయాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి: పరిపూర్ణానంద

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.