మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన సంవాదం జరిగింది. హెబీస్ రిక్విజల్ పిటిషన్‌పై పిటిషనర్లకు నోటీసులిచ్చారా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తమకు నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు సమాధానమివ్వగా....పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా విచారణలో ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది.
ఇది కోర్టు ప్రొసీడింగ్స్‌ను అడ్డుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం... అవసరమైతే కోర్టు ధిక్కరణ చర్యలకు వెనకాడబోమని హెచ్చరించింది. సోమవారంలోగా పిటిషన్ దాఖలు చేయాలని.... ప్రభుత్వం విచారణకు సిద్ధం కాకుంటే తదుపరి చర్యలు చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వం ఆస్తుల అమ్మకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తరఫున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి : రాజధాని శంకుస్థాపన స్థలిలో ప్రణమిల్లిన చంద్రబాబు