రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో... ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకూ అత్యవసర పిటిషన్లను మాత్రమే విచారణకు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. వీడియోకాన్ఫరెన్స్‌లో సమావేశమైన హైకోర్టు న్యాయమూర్తులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటి వద్ద నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతారని హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. దిగువ కోర్టులకు సంబంధించీ పలు సూచనలు చేశారు. కేవలం ఈ-ఫైలింగ్ ద్వారా మాత్రమే పిటిషన్లు దాఖలు చేయాలని... బెయిల్, దిగువ కోర్టులు విధించిన శిక్ష నిలుపుదల, హెబియస్ కార్పస్, కూల్చివేతలు తదితర అంశాలను అత్యవరస కేసులుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల్లో ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి మేరకు విచారణ దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పారు. న్యాయవాదుల సందేహాలు తీర్చుకునేందుకు జిల్లా న్యాయమూర్తులు ఓ నోడల్ అధికారిని నియమించాలన్నారు. నిత్యావసరాలు, కోర్టు విధులకు తప్ప ఇతర సందర్భాల్లో సిబ్బంది ఇల్లు విడిచి బయటకు రావొద్దని, సెలువులు తక్షణమే రద్దు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆశలు రేపుతున్న కరోనా వ్యాక్సిన్.. అతి త్వరలో రాబోతోంది..