కరోనాను నియంత్రించేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారించింది. కొంతమంది ప్రజాప్రతినిధులు లాక్డౌన్ నిబంధనలకు పాల్పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జనాలు సమూహంగా ఏర్పడేలా తామెవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలా చేసిన వాళ్లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చుకోవచ్చని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం... వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి :