ETV Bharat / city

పరిషత్‌ ఎన్నికలపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు - పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పిటిషన్

పరిషత్‌ ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. శనివారం తెదేపా, భాజపా తరపు న్యాయవాదుల వాదనలు పూర్తికాగా.. నేడు ఎస్ఈసీ వాదనలు వినిపించింది. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోటు నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్ఈసీ వివరణ ఇచ్చింది. అయితే వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

Parishad Elections in AP
ఏపీ పరిషత్ ఎన్నికలు 2021
author img

By

Published : Apr 4, 2021, 12:00 PM IST

Updated : Apr 5, 2021, 6:26 AM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో భాజపా, తెదేపా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఆదివారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా (రిజర్వు) వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ప్రకటించారు. మంగళవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఇదే అంశంపై జనసేన దాఖలు చేసిన వ్యాజ్యంలో ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ వివరాలు సమర్పించాలని విచారణను ఈ నెల 6కు వాయిదా వేశారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మొదటి నుంచి ప్రారంభించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎస్‌ఈసీ ఈ నెల 1న నోటిఫికేషన్‌ జారీ చేశారంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరో వ్యాజ్యం వేశారు. శనివారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఆదివారం విచారణలో ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి ముందుగా భాజపా వేసిన వ్యాజ్యంలో వాదనలు వినిపించారు. ‘మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు. కరోనా కారణంగా వాయిదా వేసిన ఎన్నికలను.. నిలిచిపోయిన దగ్గర్నుంచి ప్రారంభించే విచక్షణాధికారం ఎస్‌ఈసీకి ఉంది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రారంభమయ్యాక న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. స్థానిక సంస్థల కార్యవర్గ కాలపరిమితి 2018లో ముగిసింది. నిర్ధిష్ట సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎస్‌ఈసీపై ఉంది. గతేడాది మార్చిలో నిర్వహించిన ఎన్నికల్లో ఒకే నామినేషన్‌ వేసినచోట్ల ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభిస్తే న్యాయపరమైన చిక్కులొస్తాయి’ అన్నారు.

చట్ట నిబంధన లేదు

తెదేపా నేత వర్ల రామయ్య వ్యాజ్యంలో ఎస్‌ఈసీ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు కాబట్టి ప్రజాహితం కోసం వేస్తే ప్రస్తుత వ్యాజ్యాన్ని ధర్మాసనం వద్ద విచారించాలి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎస్‌ఈసీ కోడ్‌ను ఎత్తివేయని కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కోడ్‌ను సడలించిన సర్వోన్నత న్యాయస్థానం.. మళ్లీ పోలింగ్‌ నిర్వహించే తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని స్పష్టతనిచ్చింది. ఆ ఉత్తర్వులను ఆదేశాలుగా పరిగణించకూడదు. నాలుగు వారాలు ముందుగా కోడ్‌ విధించాలనే చట్ట నిబంధనలు లేవు’ అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల ప్రక్రియను నిలువరించొద్దు. ఎన్నికలు ముగిస్తే టీకా కార్యక్రమంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టొచ్చు’ అన్నారు. భాజపా నేత పాతూరి నాగభూషణం తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు కట్టబడాల్సిందేనన్నారు. విచక్షణాధికారం పేరుతో ఎస్‌ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. వర్ల రామయ్య తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు నాలుగు వారాల ముందుగా ఎన్నికల కోడ్‌ను విధించాలని పేర్కొన్నాక దాన్ని అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ నెల 1న నోటిఫికేషన్‌ ఇచ్చి ఆ రోజు నుంచి ఎన్నికలు ముగిసేదాకా కోడ్‌ విధించడం సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమే. కోడ్‌పై సందేహం ఉంటే సుప్రీంను ఆశ్రయించి స్పష్టత తెచ్చుకోవాలి’ అన్నారు.

హడావుడిగా నోటిఫికేషన్‌

జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. ‘గతేడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు నామినేషన్ల దాఖలు అడ్డగింత, బలవంతపు ఉపసంహరణలు జరిగాయి. దానిపై పూర్వ ఎన్నికల కమిషనర్‌ కేంద్రానికి లేఖ రాశారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసి ఏడాదవుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అధికారం ఎస్‌ఈసీకి ఉంది. రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం నిర్వహించకముందే హడావుడిగా ఈ నెల 1న నోటిఫికేషన్‌ జారీచేశారు. దాన్ని రద్దు చేసి, మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు.

ఇదీ చదవండి: ప్రచారంలో మోదీ దూకుడు- 23 సభలకు హాజరు

Last Updated : Apr 5, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.