ETV Bharat / city

'ప్రజాప్రతినిధుల మీద అప్పీళ్ల​ విచారణ పరిధి'పై హైకోర్టు విచారణ.. 15కు వాయిదా - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై దిగువ కోర్టుల్లో వచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయ్యే క్రిమినల్‌ అప్పీళ్ల విచారణ పరిధి.. వారిపై కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు ఉందా.. లేదా అనే విషయంపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం కావాలని కోరగా.. విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది.

Cases against MPs and MLAs
Cases against MPs and MLAs
author img

By

Published : Jul 6, 2021, 7:24 PM IST

Updated : Jul 7, 2021, 2:41 AM IST

ఏపీలో ప్రజాప్రతినిధులపై ఉన్న పలు కేసులకు సంబంధించి అప్పీల్స్ ను ప్రత్యేక కోర్టుల్లో విచారణ చేయవచ్చా.. అనే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు కింది కోర్టుల్లో ఇచ్చిన తీర్పుపై వారు అప్పీల్ వేసుకున్నారు. ఆ అప్పీల్​ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుల్లో విచారణ చేయవచ్చా అని విజయవాడ ప్రత్యేక కోర్టు జడ్జి.. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ జడ్జికి లేఖ రాశారు. సీఆర్పీసీ ప్రకారం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి హైకోర్టుకు నివేదించారు. ఇదే అంశం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది సమయం కావాలని కోరారు. తదుపరి విచారణను ఈనెల 15 కి న్యాయస్థానం వాయిదా వేసింది.

నేపథ్యం..

2017 డిసెంబరులో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా విజయవాడలోనూ న్యాయస్థానం ఏర్పాటైంది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలపై రాష్ట్రంలో ఉన్న కేసులన్నీ ప్రత్యేక కోర్టుకు చేరాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై 2008, 2011, 2014లలో నమోదైన నాలుగు కేసులను దిగువ కోర్టులు విచారణ చేసి తీర్పులిచ్చాయి.

వాటిపై కొడాలి నాని, కొల్లి వెంకట కృష్ణారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కేసులో... పోలీసులు, చింతమనేని ప్రభాకర్‌, మరికొందరు అప్పీళ్లు దాఖలు చేశారు. అయితే.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులన్నింటినీ ప్రత్యేక కోర్టుకు పంపాలని హైకోర్టు నుంచి సర్క్యులర్‌ రావడంతో.. సెషన్స్‌ కోర్టులోని అప్పీళ్లన్నీ ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి. ఈ అప్పీళ్ల విచారణ పరిధిపై సందేహం వ్యక్తం చేస్తూ విజయవాడలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి (పీడీజే)కి లేఖ రాశారు. ఆ లేఖను పీడీజే.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 395 ప్రకారం హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.

ఇదీ చదవండి:

kambhampati: మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా: కంభంపాటి

Last Updated : Jul 7, 2021, 2:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.