తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరి అరెస్ట్ , రిమాండ్ వ్యవహారంపై విచారణ జరిపిన నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్ సమయంలో మంగళగిరి పోలీసులు, రిమాండ్ విధించే సమయంలో మంగళగిరి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించరా? లేదా? తేల్చాలంది. తదుపరి విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని , కొట్టారని రిమాండ్ సందర్భంగా బ్రహ్మం చౌదరి చెప్పినప్పటికీ గాయాలను పరిశీలించకుండా, వైద్య పరీక్షకు పంపకుండా రిమాండ్ విధించడంపై నివేదిక ఇవ్వాలని మెజిస్ట్రేట్‌ని హైకోర్టు గతంలో ఆదేశించింది. తాజా విచారణలో మెజిస్ట్రేట్ సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి వాటిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వైద్య పరీక్షలకు పంపకపోవడానికి సరైన కారణం చెప్పలేదన్నారు. దీంతో విచారణ చేసి 10రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు.
ఇదీ చదవండి: