కబడ్డీ క్రీడాకారుల ఎంపిక విషయమై దాఖలైన అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌లో విభేదాల కారణంగా జాతీయ జూనియర్, సీనియర్ కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేసే బాధ్యతను ఏపీ స్పోర్ట్ అథార్జీకి అప్పగించాలని క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈనెల 22 నుంచి 25 వరకు తెలంగాణలోని సూర్యపేటలో జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలు, ఏప్రిల్ 13 నుంచి అయోధ్యలో సీనియర్ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. వ్యాఖ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం.. క్రీడాకారుల ఎంపిక బాధ్యతను శాప్ కు అప్పగిస్తూ ఈ నెల 17 న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వీరలంకయ్య అప్పీల్ వేశారు. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. అప్పీల్‌ను కొట్టేసింది.
ఇదీ చదవండి: ప్రత్యేక హోదా కుదరదు..ఆ స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం: కేంద్రం