హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ మరణంపై విచారణ కోరుతూ రామకృష్ణ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై మరోసారి విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి సోమవారమే వాదనలు ముగించి హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. అయితే విచారణ పునఃప్రారంభించాలని జడ్జి రామకృష్ణ హైకోర్టును అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం... జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్లో ఒక పేరాపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి గడువునిచ్చింది. గురువారంలోలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కౌంటర్ దాఖలు చేస్తాం
ఇంప్లీడ్ పిటిషన్ లోని కొన్ని అంశాలపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు . దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గురువారం వరకు హైకోర్టు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. జడ్జి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేసే సమయానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధి ఫెడరేషన్ ప్రతినిధి లక్ష్మీనర్సయ్య వేసిన ఒరిజనల్ పిటిషన్ పై విచారణ పూర్తి చేసి తీర్పుని ధర్మాసనం రిజర్వ్ చేసింది .
ఇదీ చదవండి
'హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించేలా ఆదేశాలివ్వండి'