ETV Bharat / city

వేసవి సెలవుల తర్వాత సంగం డెయిరీ విచారణ - ఏపీ తాజా వార్తలు

సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. లోతైన విచారణ జరపకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పింది.

sangam dairy case
ap high court adjourned a hearings on sangam dairy case
author img

By

Published : May 18, 2021, 4:13 AM IST

సంగం డెయిరీ స్వాధీనం జీవో నిలిపివేతపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై వేసవి సెలవుల అనంతరం హైకోర్టు విచారణ జరపనుంది. సంగం డెయిరీ స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. సింగిల్ జడ్జి నిలుపుదల చేశారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. లోతైన విచారణ జరపకుండా సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు నిలుపుదల చేయడం కుదరదని.. విస్తృత విచారణ అవసరమని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ , జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది .

ఇదీ చదవండి

మిలిటరీ ఆస్పత్రికి ఎంపీ రఘురామ.. నేడు పూర్తిస్థాయి వైద్యపరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.