కరోనా కట్టడి చర్యల్లో దేనికీ వెనకడుగు వేయడం లేదని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనాపై క్షేత్రస్థాయి అంశాలపై మంత్రుల కమిటీ చర్చించిందన్న ఆయన... దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు.
మంత్రి ఇంకా ఏమన్నారంటే..
- కరోనా నియంత్రణకు సీఎం ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
- కరోనా పరీక్షలు పెంచాం, అందుకే ఎక్కువ కేసులు వస్తున్నాయి.
- ఒక్కసారిగా వలసకూలీలు ఏపీకి వస్తే ఏం చేయాలనే దానిపై చర్చించినట్లు తెలిపారు.
- కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తూ.. తొలుత వలసకూలీలను సొంతరాష్ట్రాలకు పంపిస్తున్నాం.
- ఇతర రాష్ట్రాల కూలీలు ఏపీలో ఎంతమంది ఉన్నారో అంచనా ఉంది.
- వలసకూలీల తర్వాత విద్యార్థులు, యాత్రికులకు ప్రాధాన్యమిస్తున్నాం.
- ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న మనరాష్ట్ర కూలీలను ప్రభుత్వ ఖర్చులతో సురక్షితంగా స్వగ్రామాలకు తరలిస్తున్నాం.
- వలస కార్మికులకు బృందాల వారీగా పరీక్షలు చేస్తాం.
- కూలీలకు పరీక్షలు, క్వారంటైన్ విషయాలపై గురువారం నిర్ణయం తీసుకుంటాం.
- మద్యం దుకాణాల వద్ద టీచర్లను ఎక్కడా వినియోగించలేదు.
- కంటైన్మెంట్ జోన్లలో పరిస్థితి అంచనాకు వారి సేవలు వాడుకుని ఉండవచ్చు.
- ఉపాధ్యాయులు సైతం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు.
- లాక్‌డౌన్ సడలింపుల్లో క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పిస్తామన్న మంత్రి.. వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా కమిటీలో చర్చించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి..