ETV Bharat / city

బ్యాగు మోత తగ్గించే బోధన - ప్రభుత్వ పాఠశాలల్లో మూడు విధాలుగా పాఠ్యాంశాల బోధన

ప్రాథమిక విద్యలో పిల్లలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిని తీసుకురానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు... 3 విడతల విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. విద్యా సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, ఆ మేరకు... బోధన, పరీక్షల నిర్వహణను చేపట్టనుంది.

బ్యాగు మోత తగ్గించే బోధన
బ్యాగు మోత తగ్గించే బోధన
author img

By

Published : Jul 8, 2020, 5:46 AM IST

ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల బ్యాగు మోత తగ్గించేందుకు, ఒత్తిడి నివారణకు... ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానంలో విద్యా సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, పుస్తకాలను రూపొందిస్తారు. ఒక్కో సబ్జెట్‌కు 3 పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు ఇస్తారు. భాషలకు సంబంధించి ఒకే మాధ్యమంలో, ఇతర సబ్జెక్ట్‌లకు రెండు మాధ్యమాల్లో పాఠాలు ఉంటాయి. ప్రతి పుస్తకానికి ఒక వర్క్‌బుక్‌ ఉంటుంది. విద్యార్థులు వీటిలోనే తరగతి, హోంవర్కులకు సమాధానాలు రాయాలి. మొదటి విడత ముగింపులో విద్యార్థులు అప్పటివరకు నేర్చుకున్న పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది. రెండో విడతలో మొదటి విడత నుంచి 20శాతం, ప్రస్తుత పాఠ్యాంశాల నుంచి 80శాతం ప్రశ్నలుంటాయి. మూడో విడతలో మొదటి , రెండు విడతల పాఠ్యాంశాల నుంచి 10 శాతం చొప్పున, ప్రస్తుత పాఠాల నుంచి 80 శాతం ప్రశ్నలు ఇస్తారు.

ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్లం

ఆంగ్లమాధ్యమంపై కేసు సుప్రీకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఇప్పడు ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలను ముద్రిస్తారు. కన్నడం, తమిళం, ఉర్దూ లాంటి వాటికి ఒకే మాధ్యమం ఉంటుంది. ఇందుకు సంబంధించి మొదటి విడత పుస్తకాల ముద్రణ కూడా ప్రారంభమైంది. విడతల వారీగా విద్యార్థుల సామర్థాన్ని విశ్లేషించి, పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సమ్మెటివ్‌ పరీక్షలు రెండు, ఫార్మేటివ్‌లు 4 నిర్వహిస్తుండగా కొత్త విధానంలో వీటిని నిర్వహించాలా లేదా అంతర్గత పరీక్షలతో విద్యార్థుల సామర్థాన్ని అంచనా వేయాలా అనే దానిపై కసరత్తు సాగుతోంది.

ఇదీ చదవండి : 30 శాతం సిలబస్‌ తగ్గించిన సీబీఎస్‌ఈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.